Begin typing your search above and press return to search.
ఐపీఎల్ లో ఎక్కువ సెంచరీలు చేసిన జట్లు ఎవో తెలుసా?
By: Tupaki Desk | 11 March 2022 11:30 PM GMTఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ ఇదే. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసే ఈ లీగ్ లో ఆడే వారు రాత్రికి రాత్రే వారి దశ తిరిగిపోతుంది. జాతీయ జట్టుకు కూడా ఎంపికవుతుంటారు. ఐపీఎల్ లీగ్ లో సెంచరీ బాదేస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతు ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా ఆ మ్యాచ్ లు గెలిపించలేకపోయారు.
ఆ జట్టుకు కప్ ను అందించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు కొట్టిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఈ జట్టు ఐపీఎల్ లోనే అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలిచింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్ ఏకంగా 14 సెంచరీలు చేశారు. కానీ ఆ జట్టుకు తీరని కల అయిన కప్ ను అందించలేకపోయారు.
ఇక పంజాబ్ దీ అదే కథ. ఈ జట్టులోని బ్యాట్స్ మెన్ ఏకంగా బెంగళూరు తర్వాత అత్యధిక సెంచరీలు చేశారు. 13 సెంచరీలు కొట్టినా ఆ జట్టుకు కప్ ను అందించలేకపోయారు. ఇక మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్ అంతా కలిసి ఇప్పటిదాకా 10 సెంచరీలు కొట్టారు.
ఇక 4వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ 8 సెంచరీలు కొట్టారు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ 9 సెంచరీలు, ముంబై ఇండియన్స్ 4, సన్ రైజర్స్ హైదరాబాద్ 3, కోల్ కతా నైట్ రైడర్స్ 1 సెంచరీ మాత్రమే కొట్టింది.
సెంచరీలు కేవలం 4 మాత్రమే కొట్టినా కానీ అత్యధిక సార్లు గెలిచి కప్ కొట్టింది మాత్రం ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు. సెంచరీలు కొట్టడం కాదు.. టీంను గెలిపించడం ముఖ్యం అని ముంబై చాటిచెప్పింది. ఇలా ఎక్కువ సెంచరీలు కొట్టి కూడా ఒక్క కప్ అందుకొని జట్టుగా బెంగళూరు పేలవ రికార్డును తన ఖాతాలో నమోదుచేసుకుంది.
-2017లో పంజాబ్ తరుపున ఆడి హషీమ్ ఆమ్లా రెండు సెంచరీలు బాదాడు. ఒక ముంబైపై, రెండోది గుజరాత్ లయాన్స్ పై నమోదుచేశాడు.
-2016లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై సెంచరీ నమోదుచేశారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది.
-2014లో పంజాబ్ జట్టులో ఉన్న వృద్ధిమాన్ సాహా కోల్ కతాపై సెంచరీ (115)కొట్టాడు.
-2011లో ముంబై తరుఫున సచిన్ టెండూల్కర్ 66 బంతుల్లోనే కొచ్చిపై సెంచరీ సాధించాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.
2010లో రాజస్థాన్ తరుఫున ఆడిన యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లోనే ముంబైపై సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.
-డెక్కన్ చార్జర్స్ తరుఫున 2008లో ఆడిన ఆండ్రై సైమండ్స్ .. రాజస్థాన్ పై 53 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. అయినా డెక్కన్ చార్జర్స్ ను గెలిపించలేకపోయాడు.