Begin typing your search above and press return to search.

అమెరికా సెనేట్ ముందుకు ప్రపంచంలోని 4 టెక్ దిగ్గజాలు

By:  Tupaki Desk   |   29 July 2020 3:00 PM GMT
అమెరికా సెనేట్ ముందుకు ప్రపంచంలోని 4 టెక్ దిగ్గజాలు
X
టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్ లైన్ వేదికల ద్వారా విద్వేషం.. హింస పెరిగిపోతున్న ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ సెనెట్ లో బుధవారం విచారణ జరగనుంది. ఈ విచారణకు ప్రపంచంలోనే టాప్ 4 దిగ్గజాలు హాజరు కానున్నారు.

సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే వారి దిగ్గజ సంస్థలు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్థించుకోనున్నారు.

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లు విచారణకు హాజరు కానున్నారు. అమెరికన్ చట్టాలకు అనుగుణంగా కంపెనీలు పనిచేస్తున్నాయా? లేదా అనే దానిపై జ్యుడిషియరీ కమిటీ ఈ నలుగురు దిగ్గజాలను ప్రశ్నించనున్నారు. మార్కెట్ లో వీరు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలోనూ ప్రశ్నలు సధించనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగనున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు దిగ్గజ టెక్నాలజీ సంస్థల సీఈవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటుడడం ప్రాధాన్యత సంతరించుకుంది. హింసను ప్రేరేపించే విద్వేష కంటెంట్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై అమెరికన్ సెనెట్ ఎదుట వీరు విచారణకు హాజరవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.