Begin typing your search above and press return to search.

ప్రేమలో విఫలమై పిచ్చోడిగా మారిన టెక్కీ

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:19 AM GMT
ప్రేమలో విఫలమై పిచ్చోడిగా మారిన టెక్కీ
X
ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ...అన్నట్టుగా క్షణం తరువాత ఎం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేము. క్షణం వ్యవధిలోనే బికారి కోటీశ్వరుడగా మారవచ్చు ..అలాగే కోట్లకి అధిపతి అయిన రోడ్డు పైకి రావచ్చు, అందుకే విధి రాతని ఎవరు తప్పించుకోలేరు అని అంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా హైదరాబాద్ లో జరిగింది. కొన్ని రోజుల క్రితం వారం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువకుడు .. నేడు అకస్మాత్తుగా రోడ్డు పై మతి స్థిమితం లేకుండా కనిపించాడు. అసలు టెక్కీ గా ఉన్నఆ యువకుడు ఇలా కావడానికి కారణం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు ..ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో నాగార్జున సర్కిల్‌ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసాడు. జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. కానీ , పోలీసులకి కూడా చుక్కలు చూపించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యవకుడిని పట్టుకున్నారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాళ్లతో బంధించి స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో గంటసేపు నాగార్జన సర్కిల్ లో ట్రాఫిక్ జాం అయ్యింది. మసాబ్ ట్యాంక్, జూబ్లీ చెక్ పోస్టు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఆ వ్యక్తిని సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజుగా గుర్తించారు. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఐదెంకల జీతం అందుకున్న రాజు.. ఓ అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో మతి స్థిమితం కోల్పోయినట్లు తెలిసింది. ప్రేమ అనే రెండక్షరాలు అతడి వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసిందని తెలియడంతో అందరూ అతని పై జాలి చూపిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఎవరికీ హాని తలపెట్టని అతడు హఠాత్తుగా ప్రజలపై రాళ్లు ఎందుకు రువ్వాడో అర్తం కావడంలేదు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు రాజును పునరావాస కేంద్రానికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని మానసిక వైద్యశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.