Begin typing your search above and press return to search.
అవును.. మన పక్కింట్లో వాళ్లే ఐసిస్ ‘ఏజెంట్లు’
By: Tupaki Desk | 30 Jun 2016 6:47 AM GMTనిజంగానే ఇదో షాకింగ్ అంశం. అత్యంత కిరాతకంగా.. రాక్షసంగా వ్యవహరిస్తూ మానవత్వం అంటూ లేని వారిగా ఉండే ఐసిస్ తీవ్రవాదులు మన నట్టింట్లోకి వచ్చేసినట్లే. అక్కడెక్కడో ఉన్న సిరియా.. ఇరాక్ లలో చోటు చేసుకునే పరిణామాల్ని చూసిన చాలాసార్లు.. ఇలాంటివి లేని మనం ఎంత లక్కీ అని అనుకుంటూ ఉంటాం. కానీ.. ఇకపై అలాంటి సంతోషాలు ఉండనట్లే. ఎందుకంటే.. మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఐసిస్ తీవ్రవాదులు ఉండొచ్చన్న రీతిలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ ఐఏ) బుధవారం అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతి పరుల వివరాలు చూస్తే విస్మయం చెందాల్సిందే. ఎందుకంటే.. వారిలో చాలామంది ప్రజలతో నేరుగా సంబంధాలు నడిపేవారు. మన తోటి మనుషుల్లా ఉండే వారే. కానీ.. పైకి కనిపించినట్లుగా వారు సామాన్యులు కాదు. అదును కోసం ఎదురుచూస్తున్న దుర్మార్గులు. అమాయకుల్ని లక్ష్యంగా చేసుకొని.. మారణహోమం సృష్టించేందుకు వెయిట్ చేస్తున్న వాళ్లే. మనందరి అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. నిఘా వర్గం ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ విధ్వంసానికి పాల్పడి.. భయాందోళనలు కలిగించటం.. మత కల్లోలాలు సృష్టించేందుకు దారుణమైన ప్లాన్ వేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడాలని కుట్ర పనిన్నోళ్లు ఏం చేస్తుంటారో తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
తాజాగా అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుల్లో ‘మీ సేవా’ కేంద్ర నిర్వాహకుడు.. బైక్ మెకానిక్.. అటోమెబైల్ లో పని చేసే వ్యక్తితో పాటు మరో వ్యక్తి అమెజాన్ లో ఉద్యోగం చేసి మానేసిన వ్యక్తి కావటం గమనార్హం. వీరే కాకుండా.. మిగిలిన వారు సైతం సాదాసీదా మనుషులే తప్పించి నేర స్వభావం.. నేర చరిత్ర ఉన్న వారు కాకపోవటం గమనార్హం. ఈ ఉదంతంలో పట్టుబడిన వారిని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. ఇప్పుడు మన దైనందిక జీవితం మరింత అపాయకరంగా మారిందనే. గతంలో మాదిరి భరోసాగా ఉండే అవకాశం లేదని.. అనుక్షణం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని స్పష్టమైనట్లే. ఎవరిని పడితే వారిని నమ్మేయటం.. స్నేహంగా ఉండటం.. వారితో కలిసి తిరగటం.. పరిచయస్తులందరిని ఫ్రెండ్స్ అని చెప్పుకోవటం లాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే చిక్కులో చిక్కుకోవటం ఖాయం. ఎందుకంటే.. పురాణాల్లో చెప్పే రాక్షసుల కంటే భయంకరమైన ఐసిస్ తీవ్రవాదుల ఏజెంట్లు ఇప్పుడు మన చుట్టూనే.. మనలో కలిసిపోయి ఉన్నారు మరి.