Begin typing your search above and press return to search.
సికింద్రాబాద్ రోడ్డు మీద ఐటీ ఉద్యోగి హత్య
By: Tupaki Desk | 3 March 2016 6:02 AM GMTపొద్దుపొద్దున్నే.. సికింద్రాబాద్ నడి రోడ్డు మీద దారుణ హత్య జరిగింది. ఒక ఐటీ ఉద్యోగిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రాధమిక సమాచారం ప్రకారం.. స్నేహితుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తున్న పోలీసులు.. హత్య జరిగిన తీరును వివరిస్తున్నారు.
మాదాపూర్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న సంజయ్ జంగ్ సికింద్రాబాద్ పార్శిగుట్టలో నివాసం ఉంటారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ సమీపంలో సంజయ్ నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో వైట్ కలర్ స్విఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు సంజయ్ మీద దాడికి పాల్పడ్డారు. అతనిపై కత్తులతో దాడి చేశారు.
దీంతో.. సంజయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు. చాలా వేగంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో స్థానికులు స్థాణువులయ్యారు. వెనువెంటనే తేరుకున్న అక్కడికి దగ్గర్లోని ఒక సెక్యూరిటీ గార్డు.. దుండగుల్ని గుర్తించి వెంబడించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడకు కాస్త దూరంలో ఉన్న పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
అయితే.. ఉదయం వేళలో రోడ్లు ఖాళీగా ఉండటంతో నిందితులు కారులో వేగంగా వెళ్లిపోయారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ మీదుగా.. ట్యాంక్ బండ్ వైపు నిందితులు పరారీ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. సంజయ్ జేబులో ఉన్న ఐడీ కార్డు.. సెల్ ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు అసలు కారణం ఏమిటన్న విషయంపై ఫోకస్ చేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఐటీ ఉద్యోగి హత్య సంచలనంగా మారింది.