Begin typing your search above and press return to search.

ఐసిస్ నుంచి ఐటీ ఉద్యోగికి రూ.8ల‌క్ష‌లు

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:21 AM GMT
ఐసిస్ నుంచి ఐటీ ఉద్యోగికి రూ.8ల‌క్ష‌లు
X
నిత్యం దారుణ మార‌ణకాండ‌కు పాల్ప‌డుతూ.. ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికిస్తున్న ఐసిస్ చూపు భార‌త్ మీద ప‌డ‌ట‌మే కాదు.. త‌న కార్య‌క‌లాపాల జోరు పెంచిన‌ట్లుగా తాజా ప‌రిణామాలు చూస్తే అర్థంకాక మాన‌దు. ఇదెంతగా పెరిగిందంటే..భార‌త్ లో రిక్రూట్ మెంట్ మొద‌లు పెట్ట‌టంతో పాటు.. భార‌త్ లో కార్య‌క‌లాపాల కోసం హ‌వాలా మార్గంలో పెద్ద ఎత్తున న‌గ‌దును పంపుతున్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా మెట్రో నగ‌రాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్న ప‌లువురిని ఇటీవ‌ల అదుపులోకి తీసుకోవ‌టం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాద సంస్థ‌తో సంబంధాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న వారిలో ఐటీ ఉద్యోగి ముస్తాక్ షేక్ కు ఐసిస్ నుంచి భారీ మొత్తంలో న‌గ‌దు అంద‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముంబ‌యిలోని ఐటీ ఉద్యోగి ముస్తాక్ దేశంలో ఐసిస్ త‌ర‌ఫు రిక్రూట్‌మెంట్ నిర్వ‌హిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించ‌గా.. ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం ఉంద‌ని తేలింది. హ‌వాలా ప‌ద్ద‌తిలో అత‌నికి ఐసిస్ నుంచి రూ.8ల‌క్ష‌ల మొత్తం అందిన‌ట్లుగా తేలింది. త‌న‌కు అందిన మొత్తంలో చాలా భాగాన్ని వివిధ రాష్ట్రాల్లోని ప‌లువురికి అందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఐసిస్ విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం.. జాతీయ భ‌ద్ర‌తా సంస్థ మ‌రింత నిశితంగా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న విష‌యం తాజా ప‌రిణామం చెప్ప‌క‌నే చెబుతుంద‌ని చెప్పొచ్చు.