Begin typing your search above and press return to search.

ఆ దేశాల్లో కరోనా మృత్యుగంట మోగుతూనేవుంది : డబ్ల్యూహెచ్‌‌ వో

By:  Tupaki Desk   |   24 Oct 2020 2:30 PM GMT
ఆ దేశాల్లో కరోనా మృత్యుగంట మోగుతూనేవుంది : డబ్ల్యూహెచ్‌‌ వో
X
చైనాలో గత ఏడాది మొదలైన కరోనా మహమ్మారి ,ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రపంచాన్నే స్థంబింపజేసింది. అయితే , కరోనా మహమ్మారి కోరల్లో నుండి ఒక్కొక్క దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇంకా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ బీకరంగా కొనసాగుతుంది. ఈ సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిలో ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని, ముఖ్యంగా ఉత్తరార్థ గోళంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందని, ఆయా దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని టెడ్రోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల్లో వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇప్పుడు కీలకమైన స్థితిలో ఉన్నాం. రాబోయే కొన్ని నెలలు ఇండియా, చైనా, రష్యా, కెనడా, అమెరికా, యూకే, జర్మనీ లాంటి పలు దేశాలకు మరింత కఠినంగా మారబోతున్నాయి. అందుకే మరణాలను తగ్గించడం, అవసరమైన హెల్త్ సర్వీసెస్‌‌ కుప్పకూలిపోకుండా చూసుకోవడంతోపాటు స్కూళ్లు మూతబడకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాధినేతలను మేం కో్రుతున్నాం. ఫిబ్రవరిలో చెప్పిన విషయాలనే నేను మళ్లీ రిపీట్ చేస్తున్నా అని టెడ్రోస్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల విషయంలో విపరీతమైన పెరుగుదల నమోదవుతోందన్నారు.