Begin typing your search above and press return to search.
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్‌లో ఉందో తెలిసింది
By: Tupaki Desk | 15 Feb 2019 1:30 AM GMTగ్రామ సహాయకుల పోస్టుకు వచ్చిన దరఖాస్తుల్లో పీజీ - బీటెక్ - ఎంటెక్ స్టూడెంట్లు... రైల్వే గ్యాంగ్ మన్లలో పీజీలు - ఎంటెక్ లు చదివినవారు... మన ఇంటికి ఇంటర్నెట్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన కుర్రాడిని అడిగితే చెప్పే క్వాలిఫికేషన్ బీటెక్.. పక్క వీధి కిరాణా దుకాణంలో కుర్రాడి చదువు పీజీ.. ఒకరా ఇద్దరా... ఇలా దేశమంతా మంచి చదువులు చదువుకుని చిన్నాచితకా పనులు చేసుకుంటున్నవారు కోట్లలో ఉన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇది సూచన.. అయితే, ఇది ఎలాంటి నిరుద్యోగం? చేయడానికి ఏ పనీ లేకపోతే నిరుద్యోగం కదా.. ఏదో ఒక పని చేసుకుంటున్నారు కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ముఖ్యం అనే వాదనా ఉంది. అవును నిజమే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాన్సెప్ట్ వందశాతం సమర్థించదగినదే. కానీ, అదే సమయంలో ఎంతో విలువైన - అర్హతలున్న మానవ వనరులు ఇలా సంబంధం లేని పనులు చేస్తూ వృథా అవుతుంటే దేశానికి ఏం ఉపయోగం? కాబట్టి ఇది కూడా నిరుద్యోగమే. దీన్నే ఎకనామిక్స్ పరిభాషలో Under Unemployment (తెలుగులో: అల్ప ఉద్యోగిత ) అంటారు. రీసెంటుగ కోల్ కతాలో ఓ వ్యక్తి చేసిన ఫేస్ బుక్ పోస్టింగ్ తో ఈ అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
కోల్‌కతాకు చెందిన శౌవిక్ దత్తా అనే డిగ్రీ కుర్రాడు రీసెంట్‌గా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వివరాలను ఆ యాప్ లో చూశాడు. జొమాటో ఇప్పుడు డెలివరీ బాయ్స్ విద్యార్హతలు - ఏఏ భాషలు మాట్లాడుతారు వంటి వివరాలన్నీ ఉంచుతోంది. దీంతో... తనకు ఫుడ్ తెస్తున్న మిరాజ్ అనే ఆ డెలివరీ బాయ్ వివరాలు చూసి దత్తా ఆశ్చర్యపోయాడు. ఆయన ఎం.కాంతో పాటు ఫైనాన్స్‌లో పీజీ డిప్లమో చదివిన విషయం తెలుసుకున్నాడు.. తనకు ఫుడ్ తీసుకొచ్చిన సమయంలో అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు.
ఆ వివరాలన్నిటితో ఫేస్ బుక్ లో ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు. పదో తరగతి చదువుకున్నవారు, పీజీ చేసిన వారూ ఒకే ఉద్యోగం చేస్తే దేశానికి ఏం ఉపయోగం. ఏమీటీ దౌర్భాగ్యంఅంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఒక డిగ్రీ చదువుతున్న కుర్రాడికి మాస్టర్స్ గ్రాడ్యుయేట్ ఫుడ్ డెలివరీ చేయడానికి రావడమా? దేశం ఎటుపోతోంది... ఉద్యోగాలు క్రియేట్ చేయకపోతే చాలా కష్టం అంటూ మిరాజ్ వివరాలున్న జొమాటో స్క్రీన్ షాట్ కూడా ఆయన ఆ పోస్టింగ్ లో రాశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. వేలాదిమంది షేర్ చేశారు. ఆ తరువాత మిరాజ్ వివరాలు తెలుసుకున్న కొన్ని సంస్థలు ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం.