Begin typing your search above and press return to search.

రైలుకు ఎదురెళ్లిన అమ్మాయి ఏమైంది?

By:  Tupaki Desk   |   5 Jun 2017 4:58 PM GMT
రైలుకు ఎదురెళ్లిన అమ్మాయి ఏమైంది?
X
క‌ల‌లో కూడా ఊహించ‌న‌లేని ఘ‌ట‌న‌లు కొన్ని చోటు చేసుకుంటాయి. నిజంగా సాధ్య‌మేనా? అన్న సందేహం క‌లిగేలా ఉండే ఇలాంటి ఉదంతాల్ని చూస్తే.. ఆశ్చ‌ర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఈ ఉదంతాన్ని చూస్తే అనిపించేది ఒక్క‌టే.. భూమి మీద నూక‌లు ఉంటే ఏం జ‌రిగినా బ‌తుకుతార‌ని. సీసీ కెమేరాలో రికార్డు అయిన ఈ ఉదంతం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. రైలుకు ఎదురెళ్లిన అమ్మాయి ఏమైంద‌న్న ప్ర‌శ్న‌కు ఊహించ‌లేని స‌మాధానమే ఈ వీడియో.

ముంబ‌యిలోని భంద‌ప్ ప్రాంతానికి చెందిన పందొమ్మిదేళ్ల ప్ర‌తిక్ష న‌తేక‌ర్ అనే యువ‌తి కుర్లాలోని త‌న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో తిరిగి వ‌స్తూ.. కుర్లా రైల్వేస్టేష‌న్లోని ఏడో నెంబ‌రు ప్లాట్ ఫారం మీద‌కు వెళ్లేందుకు ప‌ట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం నుంచి దిగి వ‌స్తోంది. అదే స‌మ‌యంలో ఆమె న‌డుస్తున్న ప‌ట్టాల మీద గూడ్స్ రైలు వ‌స్తోంది. అయితే.. చెబిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న ఆమె.. ముంచుకొస్తున్న ప్ర‌మాదాన్ని అస్స‌లు ప‌సిగ‌ట్ట‌లేదు.

ఒక్క‌సారిగా త‌లెత్త‌టం.. ఎదురుగా రైలు క‌నిపించ‌టంతో భ‌యంతో ఫ్లాట్ ఫాం పైకి ప‌రిగెత్తే లోపులో.. ఆమె రైలుకు ఎదురెళ్లిపోయిన ప‌రిస్థితి. ఆమెను చూసిన రైలు డ్రైవ‌ర్ బ్రేకులు వేశారు. పెద్ద శ‌బ్దంతో ఆగిన గూడ్స్ బండి ఆమెను నెమ్మ‌దిగానే ఢీ కొట్టింది. రెండు మూడు బోగీలు ఆమె మీద నుంచి వెళ్లిపోయాయి. ఇదంతా చూస్తున్న ఫ్లాట్ ఫాం మీద జ‌నం ఆమె చ‌నిపోయింద‌ని భావించారు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో అదృష్టం బాగుండి.. ఆమెకు ఏమీ కాలేదు. అంతా చ‌నిపోయింద‌నుకున్న ఆ అమ్మాయికి ఎడ‌మ కంటికి చిన్న గాయం త‌ప్పించి ఏమీ కాక‌పోవ‌టంతో ఈ ఉదంతం ఒక మిరాకిల్ గా మారింది. సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది కాబ‌ట్టి న‌మ్ముతున్నారు కానీ.. లేదంటే ఈ ఉదంతాన్ని నోటి మాట‌తో చెబితే అస్స‌లు న‌మ్మ‌లేని ప‌రిస్థితి. ఏమైనా ఈ ఉదంతం ఇప్పుడు వైర‌ల్ గా మారింది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/