Begin typing your search above and press return to search.
గుప్త నిధుల కోసం కర్నూలులో దారుణ హత్య.!?
By: Tupaki Desk | 13 July 2019 4:39 AM GMTకర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. చాలా రోజులుగా మూఢ నమ్మకాలతో గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిగేవట.. ఇప్పుడు అదే చోట హత్య జరగడం కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లా సిరివేళ్ల సమీపంలోని నరసింహస్వామి దేవాలయం సమీపంలో గుప్త నిధుల కోసం చాలా రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే నరబలి ఇచ్చారంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆ దేవాలయం సమీపంలోనే ఒక యువకుడి శవం కనిపించడం కలకలం రేపుతోంది. గుప్త నిధుల కోసమే ఇక్కడ ఒక యువకుడిని నరబలి ఇచ్చినట్టు సమాచారం.
ఇదే ఏరియాలో రాయల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం - వజ్రాల నిక్షేపాలున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి పురావస్తు - మైనింగ్ - రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో స్థానికులు కూడా ఇక్కడ గుప్త నిధులున్నాయని ఇలా తవ్వకాలు చేస్తూ నరబలులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తాజాగా సిరివేళ్ల నరసింహ స్వామి ఆలయంలో ఓ యువకుడి దేహం - తల రెండూ వేరు చేయబడి వేర్వేరుగా పడి ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి బలి చేసిన ఆ యువకుడు ఎవరు? ఎక్కడి వారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.