Begin typing your search above and press return to search.

క‌న్యత్వాన్ని అమ్మేసిన అమెరిక‌న్ టీనేజ్ మోడ‌ల్

By:  Tupaki Desk   |   19 Nov 2017 1:30 AM GMT
క‌న్యత్వాన్ని అమ్మేసిన అమెరిక‌న్ టీనేజ్ మోడ‌ల్
X
కొన్ని దిక్కుమాలిన ప‌నుల గురించి వింటే వామ్మో అనిపిస్తుంది. అలాంటి కోవ‌కు చెందిందే ఈ న్యూస్‌. డ‌బ్బు కోసం త‌మ క‌న్య‌త్వాన్ని ఆన్ లైన్లో పెట్టి అమ్మేసే అడ్వాన్స్ క‌ల్చ‌ర్ అమెరికా.. యూరోప్ దేశాల్లో క‌నిపిస్తుంటుంది. చ‌దువు కోస‌మ‌ని కొంద‌రు.. ఇత‌ర అవ‌స‌రాల కోస‌మ‌ని మ‌రికొంద‌రు త‌మ క‌న్య‌త్వాన్ని అమ్మేస్తుంటారు.

నా క‌న్య‌త్వం.. నా ఇష్టం అన్న‌ట్లుగా ఉండే వీరి తీరు ఇలా ఉంటే.. త‌మ‌కున్న సంప‌ద‌తో అలాంటివి కొనుగోలుచేయ‌టానికి అర‌బ్బు షేకులు కొంద‌రు రెఢీగా ఉంటారు. క‌న్య‌త్వాన్ని కొనుగోలు చేసే వారు అర‌బ్బు షేకులే కాదు.. బాగా బ‌లిసిన బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తాజాగా 19 ఏళ్ల అమెరిక‌న్ టీనేజ్ మోడ‌ల్ గిసిల్లీ త‌న క‌న్య‌త్వాన్ని సేల్‌ కు పెట్టింది.

ఇక్క‌డ చెప్పాల్సిన విష‌యం మ‌రొక‌టి ఉంది. అన్ని వ్యాపారాల‌కు ఉన్న‌ట్లే.. ఇలా క‌న్వ‌త్యాన్ని అమ్ముకోవ‌టానికి బ్రోక‌రేజ్ వెబ్ సైట్లు ఉన్నాయి. ఆ త‌ర‌హా సేవ‌లు అందించే జ‌ర్మ‌న్ దేశానికి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ అనే వెబ్ సైట్ త‌గ‌ల‌బ‌డింది. ఈ వెబ్ సైట్ ద్వారా అమ్మ‌కాలు పెట్టుకోవ‌చ్చు. ఇలాంటి వెబ్ సైట్లు చూసి.. త‌మ అవ‌స‌రాలు తీర్చుకునే డ‌బ్బులున్న మారాజులు ఉంటారు.

త‌న క‌న్య‌త్వాన్ని అమ్మ‌కానికి పెట్టిన గిసిల్లీ అందాల‌కు ముగ్ధుడైన అబుదాబీకి చెందిన బ‌డా వ్యాపారి ఒక‌రు 2.5 మిలియ‌న్ యూరోల‌కు (సుమారు 19 కోట్ల రూపాయిలు) అమ్మేసింది. క‌న్య‌త్వాన్ని స‌మ‌ర్పించుకోవ‌టానికి వెళ్లేట‌ప్పుడు త‌న‌తో పాటు సెక్యూరిటీని కూడా తీసుకెళ్ల‌నున్న‌ట్లుగా వెల్ల‌డించిందీ భామ‌. ఇంత‌కీ గీసెల్లీ త‌న క‌న్య‌త్వాన్ని ఎందుకు అమ్మ‌కానికి పెట్టుకుందో తెల‌సా.. యూనివ‌ర్సిటీలో చ‌దువుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన ట్యూష‌న్ ఫీజు క‌ట్ట‌టానికంటూ చెప్పింది. మోడ‌ల్ గా ప‌ని చేస్తే ఆ డ‌బ్బులు రావా? లాంటి ప్ర‌శ్న‌లు వేసుకోమాకండి. గీసెల్లి లైఫ్ ఆమెదే. త‌ప్పొప్పులు జ‌డ్జి చేయ‌టానికి మ‌న‌మెవ్వ‌రం?