Begin typing your search above and press return to search.
ప్రేయసి ఎంగేజ్ మెంట్..గుళ్లో ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్
By: Tupaki Desk | 16 Sep 2019 5:59 AM GMTప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ప్రేమికుడు ఇచ్చే బహుమతి ఏమిటి? తన ఇష్టాన్ని గౌరవించటం.. తన నిర్ణయానికి విలువ ఇవ్వటం. అయితే.. ఇదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పటి ప్రేమలన్నీ అందుకు భిన్నమైనవి. కోరుకున్నది సొంతం కావాలి. లేదంటే అంతం కావటమో.. కాదంటే అంతం చేయటమో అలవాటుగా మారింది. తాజా ఉదంతం కూడా అలాంటి కోవకు చెందినదే.
ప్రేమించిన ప్రేయసికి వేరే వారితో పెళ్లి జరగటాన్ని జీర్ణించుకోలేం. అలా అని.. ఆమెపై ఒత్తిడి తీసుకురావటం.. ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేయటం.. అంతకూ కుదరకుంటే చచ్చిపోవటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. అలాంటి దరిద్రపుగొట్టు ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాకు చెందిన శ్యాం రాజ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు.
అయితే.. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ అమ్మాయిని తనతో వచ్చేయాలని కోరాడు. అందుకు ఆమె నో చెప్పింది. ప్రియురాలు లేకుండా తాను బతకలేనన్న వేదనతో సూసైడ్ నోట్ రాసిన అతడు.. స్థానికంగా ఉన్న గుడికి వెళ్లాడు. అక్కడ ఫేస్ బుక్ లైవ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ ఘటనను చూస్తే.. ప్రేమించింది సొంతం చేసుకోవాలన్న స్వార్థం తప్పించి మరింకేమీ కనిపించదు. తనను కని పెంచిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా.. తన ప్రేమ తప్పించి ఇంకేమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించే శ్యాం లాంటి వారు బాధ్యతారాహిత్యానికి కేరాఫ్ అడ్రస్ లుగా నిలుస్తారని చెప్పక తప్పదు. చనిపోయి.. ప్రేమించిన అమ్మాయిని ఇక్కట్లు పాలు చేయటమే అసలుసిసలు ప్రేమా? అన్నది క్వశ్చన్.