Begin typing your search above and press return to search.

ఇప్పటి వరకు దేశంలోని మరే టీనేజర్ చేయని పని చేసి విజేతగా నిలిచింది

By:  Tupaki Desk   |   3 May 2022 5:31 AM GMT
ఇప్పటి వరకు దేశంలోని మరే టీనేజర్ చేయని పని చేసి విజేతగా నిలిచింది
X
ఇప్పటివరకు మన దేశానికి చెందిన ఏ టీనేజర్ చేయలేని ఘనతను చేసి చరిత్రను క్రియేట్ చేసింది మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల యువకెరటం. దేశానికి చెందిన ఏ జూనియర్ వెయిట్ లిఫ్టర్ కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకోవటం ద్వారా.. ఈ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తొలి అమ్మాయిగా నిలిచింది.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేసిందన్న విషయంలోకి వెళితే..మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల హర్షద గరుడ్.. గ్రీస్ లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంఫియన్ షిప్ లో 45 కేజీల విభాగంలో టాప్ లో నిలిచి రికార్డును క్రియేట్ చేసింది.

ఈ మెగా ఈవెంట్ చరిత్రలో బంగారు పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. ఫూణెకు చెందిన ఈ టీనేజర్.. 2020లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోనూ తన సత్తా చాటింది. స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ప్రపంచ చాంఫియన్ షిప్ లోనూ తానేమిటో ప్రపంచానికి చాటింది. 45 కేజీల విభాగంలో స్నాచ్ లో 70 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ లో 83 కేజీల బరువును ఎత్తింది.

మొత్తంగా 153 కేజీలను ఎత్తి టాప్ ర్యాంక్ లో నిలిచింది. స్వర్ణాన్ని మనమ్మాయి సొంతం చేసుకుంటే.. రజతం టర్కీకి చెందిన కాన్సు బెక్టాస్ సొంతం చేసుకోగా.. రజతాన్ని మాల్డోవాకు చెందిన హిస్కులు మినిత సాధించారు. గతంలో ఈ టోర్నీలో భారతీయ టీనేజర్లు మెరిసినా.. వారెవరూ స్వర్ణాన్ని సొంతం చేసుకోలేదు.