Begin typing your search above and press return to search.

సూసైడ్ లేఖ: కోరిక తీర్చలేక చస్తున్నానమ్మా

By:  Tupaki Desk   |   24 Feb 2020 8:30 PM GMT
సూసైడ్ లేఖ: కోరిక తీర్చలేక చస్తున్నానమ్మా
X
ఓ యువకుడి వేధింపుల కారణంగా ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడి వల్లే చనిపోతున్నట్టు పేర్కొంది.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని మోరిపోడులో ఆ యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఉరివేసుకొని తనువు చాలించింది. ఓ యువకుడు తన కోరిక తీర్చాలని గదికి రావాలని లేకపోతే నా ఫొటోలు బయట పెడుతానని బెదిరిస్తున్నాడని.. నీకు చెప్పలేక.. ఆ యువకుడిని ఎదురించలేక చస్తున్నా అంటూ ఆ యువతి తల్లికి లేఖ రాసి ఉరివేసుకుంది. ఈ లేఖ వైరల్ గా మారింది. నా ఫొటోలు దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. కోరిక తీర్చకపోతే బయటపెడుతానంటున్నాడని.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దని ఇంటర్ విద్యార్థిని తల్లికి రాసిన లేఖలో తన బాధ వెళ్లగక్కింది.

కాగా విద్యార్థిని చావుకు కారణమైన యువకుడిని అరెస్ట్ చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. యువకుడే చంపేశాడంటూ నిరసన తెలిపాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.