Begin typing your search above and press return to search.
తీన్మార్ మల్లన్న ఓడినందుకు పురుగులు మందు తాగి సూసైడ్
By: Tupaki Desk | 21 March 2021 11:53 AM GMTఅభిమానం హద్దులు దాటుతోంది. తమ అభిమాన నేత ఎన్నికల్లో ఓడిపోతే ఆత్మహత్య చేసుకోవటమా? చచ్చి సాధించేదేమిటి? అంతకంటే.. బతికి ఉండి.. సదరు నేతకు మరింత సాయంగా ఉంటే సరిపోతుంది కదా? ఈ చిన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. తాము అభిమానించే వారికి గెలుపు తప్పించి.. ఓటమి ఎదురుకాకూడదన్న కోరిక మంచిదే కానీ.. ఓటమి చెందితే.. భరించలేక ఆత్మహత్య చేసుకోవటం ఏ మాత్రం సరికాదు.
తాజాగా అలాంటి విషాదం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అంకలపల్లికి చెందిన 21 ఏళ్ల ఏర్పుల శ్రీశైలం తాజాగా వెల్లడైన నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం తాను అభిమానించే తీన్మార్ మల్లన్న ఓటమి చెందటంతో అన్కమనస్కంగా ఉన్న అతడు.. ఈ ఉదయం (ఆదివారం) పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీశైలం మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాడు.
తన అభిమాని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న తీన్మార్ మల్లన్న షాక్ కు గురయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం కుటుంబ సభ్యుల పరిస్థితి తలుచుకుంటేనే అయ్యో అనిపించకమానదు. అభిమానం ఉండాలె కానీ.. వారు సైతం వేదన చెందేంత అభిమానం ఏ మాత్రం మంచిది కాదు.