Begin typing your search above and press return to search.

కేటీఆర్​పై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘తీన్మార్​’

By:  Tupaki Desk   |   27 March 2021 3:30 PM GMT
కేటీఆర్​పై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘తీన్మార్​’
X
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్​ గెలుపొందినప్పటికీ.. తీన్మార్​ మల్లన్న మాత్రం హీరోగా నిలిచాడు. గణనీయంగా ఓట్లు సాధించడమే అందుకు కారణం. తీన్మార్​ మల్లన్న తన యూట్యూబ్​ చానల్​.. ఫేస్​బుక్​ వీడియోల ద్వారా తరచూ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరంగల్​ కాకతీయ యూనివర్సిటీలో ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ ఘటనపై తీన్మార్​ మల్లన్న మాట్లాడుతూ.. సదరు నిరుద్యోగి ఆత్మహత్యయత్నానికి కేటీఆర్​ దే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ‘ రాష్ట్రంలో నిరుద్యోగానికి కారణం కేటీఆరేనని, హన్మకొండ చౌరస్తాలో కేటీఆర్​ ను ఉరితీయాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. కేటీఆర్​ నే ఈ స్థాయిలో విమర్శించడం పట్ల టీఆర్​ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బొండు సునీల్ అనే నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేయడం లేదు. అందుకే తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నానంటూ అతడు సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు.

వెంటనే స్థానికులు అతడిని వరంగల్ మహాత్మా గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. సునీల్‌ను తీన్మార్​ మల్లన్న పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్​ ను గద్దె దించితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తీన్మార్​ మల్లన్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. తీన్మార్​ మల్లన్న క్యూ న్యూస్​ అనే ఓ యూట్యూబ్​ చానల్​ ఏర్పాటు చేసి దాని ద్వారా నిత్యం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటారు. సీఎం కేసీఆర్​, కేటీఆర్​ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో అతడికి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఫాలోయింగ్​ వచ్చింది.