Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ తీన్మార్ మ‌ల్ల‌న్న ర‌చ్చ‌.. వేడెక్కిన రాజ‌కీయం

By:  Tupaki Desk   |   25 Dec 2021 3:33 PM GMT
మ‌ళ్లీ తీన్మార్ మ‌ల్ల‌న్న ర‌చ్చ‌.. వేడెక్కిన రాజ‌కీయం
X
మ‌రోసారి తీన్మార్ మ‌ల్ల‌న్న ఉర‌ఫ్‌.. చింత‌పండు మ‌ల్ల‌న్న కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆయ‌న‌పై మ‌రోసారి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ కుమారునిపై తీన్మార్ మల్ల న్న ట్వీట్ చేశారు. దీంతో బంజారా హిల్స్‌ ఏసీపీకి టీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీ ఆర్‌ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్‌ సానుభూ తిపరులు తీన్మార్‌ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. ఒక‌రిద్ద‌రు చెంప దెబ్బ‌లు కొట్టారు.

మల్లన్న ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాక్ స్వాతంత్రం ఉందని.. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. మ‌రోవైపు.. మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా రవాణా శాఖా మంత్రి మంత్రి అజయ్ నిలిచారు. చిన్నపిల్లలను కించ పరిచే విధంగా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పోస్టులు పెట్టడం దారుణన్నారు. హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్ట్ పెట్టింది కాక మళ్ళీ తన ట్విట్టర్ హ్యాక్ అయిందని చెపుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నాము కదా అని సంయమనం పాటిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలు ఆవేశంలో ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల గురించి తాము మాట్లాడలేకనా అని ఆయన నిలదీశారు.


మంత్రి కేటీఆర్ కుమారుడి గురించి తీన్మార్ మల్లన్న చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుని మీద పెట్టిన ట్వీట్‌ను ఖండిస్తున్నా మన్నారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. దీని వెనుక బీజేపీ ఉందని... బండి సంజయ్ ఉన్నారని... ఇది ఆ పార్టీ సంస్కృతి అని ఆరోపించారు. బీజేపీ నాయకులకు చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. మొత్తానికి మ‌రోసారి తీన్మార్ మ‌ల్ల‌న్న కేంద్రం రాజ‌కీయం వేడెక్క‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.