Begin typing your search above and press return to search.
వర్క్ ఫ్రం హోంపై టీటా సర్వే.. ఆసక్తికర అంశాలు వెల్లడి
By: Tupaki Desk | 16 Jun 2020 3:30 PM GMTమహమ్మారి దెబ్బకు ప్రపంచ స్వరూపమే మారిపోయిన పరిస్థితి. ప్రపంచంలో కీలకమైన ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉండటంతో వారి ఉపాధికి పెద్ద ఇబ్బంది లేకుండా రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటా సంస్థ ఒక సర్వేను నిర్వహించింది. 150 కంపెనీల్లో పని చేస్తున్న 500 మందితో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వర్క్ ఫ్రం హోంతో పాటు.. పలు అంశాల్ని ప్రస్తావించింది.
ఈ సర్వే రిపోర్టు తాజాగా విడుదలైంది. ఇందులో ఆసక్తికరఅంశాలు వెల్లడయ్యాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా భార్యభర్తల బంద: మరింత పెరిగినట్లుగా తేలింది. అంతేకాదు.. రోజువారీగా పని చేసే గంటలు కూడా బాగా పెరిగాయని వెల్లడైంది. దేశంలో విడాకులు ఎక్కువగా తీసుకునే రంగం ఐటీ అన్న మాట వినిపిస్తున్న వేళ.. లాక్ డౌన్ నేపథ్యంలో తెర మీదకు వచ్చిన వర్క్ ఫ్రం హోం దంపతుల మధ్య బంధాన్ని మరింత పెంచేలా చేయటం గమనార్హం.
ఇంటి నుంచి పని చేయటానికి ఒత్తిడికి గురి కాలేదని 62 శాతం అభిప్రాయపడగా.. ఇతర దేశాల్లో పని చేసే అవకాశం లభిస్తే వెళతారా? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరంగా వెళ్లమని 57 శాతం మంది చెప్పారు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా రోజులో 12 గంటల కంటే ఎక్కవగా పని చేసినట్లు 8.3 శాతం మంది పేర్కొంటే.. 8 నుంచి పది గంటలు పని చేసినట్లుగా 48.9 శాతం పేర్కొన్నారు. ఇక పది నుంచి పన్నెండు గంటల పాటు పని చేసిన వారు 28.1 శాతం మంది పని చేశారన్నారు.
వర్క్ ఫ్రం హోంను కొనసాగించటానికి 82 శాతం మంది ఓటు వేశారు. ఇంటి నుంచి పని చేయటానికి ఇంట్లో ప్రత్యేకమైన పని వాతావరణం ఉందా? అంటే ఉందని 62 శాతం మంది పేర్కొన్నారు. ఇంట్లో ఎక్కడి నుంచి పని చేశారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. మొయిన్ హాల్లో 22.9 శాతం మంది పని చేస్తే.. బెడ్రూం నుంచి 44.7 శాతం మంది పని చేశారు. ఇంట్లోనూ వర్క్ స్పెస్ 23.9 శాతం మందికి ఉన్నట్లు వెల్లడించారు. ఇంటి నుంచి పని చేస్తున్న కంపెనీల్లో 91. 6 శాతం ఎలాంటి ఇన్సెంటివ్ లు ప్రకటించలేదని పేర్కొనటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. వ్యక్తిగత జీవితం బాగున్నా.. ఆఫీసుకు వెళ్లి పని చేసే కన్నా.. ఎక్కువ పని ఇంటి నుంచి పని చేసే విధానంలో ఉందన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేసిందని చెప్పాలి.