Begin typing your search above and press return to search.
బాల్ ఠాక్రే ఓ ఉగ్రవాది
By: Tupaki Desk | 17 Aug 2015 1:51 AM GMTసంచలనాల తెహల్క మేగజైన్... మరో వివాదానికి తెరతీసింది. మరాఠాల ఆత్మగౌరవ ప్రతీక… శివసేన పార్టీ వ్యవస్థాపకుడు అయిన దివంగత బాల్ థాక్రేను టెర్రరిస్ట్ యాకూబ్ మెమన్ తో పోల్చింది. గత నెల 30న విడుదలైన తెహల్క మేగజైన్ తన ఎడిషన్‌లో ఓ వార్త పబ్లిష్ చేసింది. ‘వూ హీజ్ ది బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ ఆఫ్ దెమ్ ఆల్?’ అనే ఆ వార్తలో బాల్ థాక్రేను, యాకూబ్ మెమన్ తో పోల్చి వార్త రాసింది.
తెహల్కా మేగజైన్ ఆ సంచికలోని కవర్ స్టోరీపై 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, ఇదే కేసులో ఇటీవల ఉరితీతకు గురైన యాకుబ్ మెమన్, ఖలిస్థాన్ నేత జర్ నైల్ సింగ్ ల ఫొటోలతో పాటు బాల్ థాకరే ఫొటో కూడా పెట్టారు. వీరు నలుగురూ ఉగ్రవాదులని రాశారు. అంతటితో ఆగకుండా.... అందరి కంటే పెద్ద ఉగ్రవాది ఎవరని తేల్చుతూ ప్రశ్నలు వేయడంపై శివ సైనికులు భగ్గమన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఫిర్యాదు చేసింది. తెహల్కా మేగజైన్‌ను నిషేధించాలని డిమాండ్ చేసింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని ఎంఎన్‌ఎస్ కోరింది.
తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ తన కింది స్థాయి ఉద్యోగైన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అరెస్టై ఇటీవలే విడుదలయ్యారు. 2000 సంవత్సరంలో బీజేపీ అప్పటి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ముడుపులు తీసుకున్నారంటూ స్టింగ్ ఆపరేషన్ చేయడం ద్వారా తెహల్కా మొదటిసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.