Begin typing your search above and press return to search.
మోడీపై లాలూ కుమారుడి సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 15 Sep 2016 10:00 AM GMTబీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫొటోలు దిగడం వివాదం కావడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. హత్యకేసు నిందితులతో సంబంధాలున్నాయంటూ ఆయన్ను పదవి నుంచి రాజీనామా చేయాలని బీహార్లో విపక్షమైన బీజేపీ నేతలు డిమాండు చేస్తున్నారు. అయితే... తేజ్ ప్రతాప్ అందుకు సమాధానంగా ఏకంగా మోడీనే మధ్యలోకి లాగి ఈ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మోడీపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సెక్సు రాకెట్ నిందితులతో మోడీకి సంబంధాలున్నాయని... వారితో కలిసి ఆయన దిగిన ఫొటోలున్నాయని ఆరోపిస్తూ మోడీ తొలుత రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేస్తున్నారు.
‘సెక్స్ రాకెట్ నిందితుడు టిను జైన్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో దిగారు. నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు ముందు ప్రధాని మోదీని రాజీనామా చేయమని అడగండి’ అంటూ తేజ్ ప్రతాప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక.. టిను జైన్ తో మోదీ దిగిన ఫొటోను ఫేస్ బుక్ లో ఆయన పోస్టు చేశారు. జైన్ ఒకప్పుడు భాజపా సభ్యుడని - ప్రధాని మోదీ నుంచి పార్టీ అగ్రనేతలందరితోనూ అతడికి పరిచయం ఉందని తేజ్ ప్రతాప్ ఆరోపించారు.
బిహార్ లో ఇటీవల హత్యకు గురైన పాత్రికేయుడు రాజ్ దేవ్ రంజన్ హత్య కేసులో కీలక నిందితుడు మహ్మద్ కైఫ్ తో తేజ్ ప్రతాప్ ఉన్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో ఈ గొడవ రేగింది. ఈ ఫొటో విషయమై తేజ్ ప్రతాప్ పై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. తనను రోజూ చాలా మంది తనను కలుస్తారని - తనతో కలిసి ఫొటోలు దిగుతారని, వాళ్లకి సంబంధించిన విషయాలు తనకెలా తెలుస్తాయని ప్రశ్నించిన తేజ్ ప్రతాప్... మోడీని ముగ్గులోకి లాగి బీజేపీ నేతల నోటికి తాళం వేశారు.