Begin typing your search above and press return to search.
ఐశ్వర్యను భర్త ఇలా వేధించాడా...ఆశ్చర్యపోయేలా...!
By: Tupaki Desk | 7 Aug 2019 2:17 PM GMTబీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఊహించని రీతిలో వార్తల్లోకి ఎక్కారు. అప్పుడప్పుడు రాధలా - కృష్ణుడిలా - శివుడిలా తయారవుతూ వార్తల్లో నిలిచే తేజ్ ప్రతాప్ గెటప్ ల వెనుక అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆయన తనకు తానే దేవతామూర్తీని అన్న భావనతో ఉంటాడట. ఈ విషయాన్ని ఆయన మాజీ భార్య వెల్లడించింది. ఐశ్వర్యరాయ్ తన పిటిషన్ లో పేర్కొన్న అంశాల ప్రకారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ విచిత్ర వ్యక్తి - అతను డ్రగ్స్ కు బానిస అని న్యాయస్థానంలో నమోదు చేసిన పిటిషన్ లో ఐశ్వర్యరాయ్ పేర్కొంది.
బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. తల్లి రబ్రీదేవి ఎంపిక చేయడంతో తేజ్ ప్రతాప్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, కానీ అయిదు నెలలకే భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఇంట్లో వాళ్లు వారిస్తే కనిపించకుండా పోయాడు. కాగా, తాజాగా ఐశ్వర్య సైతం విడాకుల కోసం పిటిషన్ వేశారు. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
కొద్దికాలం క్రితం తేజ్ ప్రతాప్ ఊహించని రీతిలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ దళితుడి ఇంటికి వెళ్లి అక్కడ స్నానం చేసిన తేజ్ ప్రతాప్ ఆ తర్వాత మళ్లీ ఓ సైకిల్ యాత్ర కూడా చేశారు. అనంతరం పాట్నాలో ఉన్న శివాలయంలో శివుడి అవతారాన్ని ధరించి ఆ వేషధారణలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పులి చర్మం ధరించి.. తేజ్ ప్రతాప్ ప్రత్యేకంగా కనిపించారు. ఇక్కడ నుంచి ఆయన డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. అయితే, ఈ వేషాలు - ప్రత్యేకతల వెనుక అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సెక్షన్ 26 ప్రకారం తనకు రక్షణ కల్పించాలంటూ ఫ్యామిలీ కోర్టులో ఐశ్వర్య దాఖలు చేసిన పిటిషన్ లో ఆశ్చర్యకర విషయాలు ఆమె బయటపెట్టింది. ఆ పిటిషన్ లో తేజ్ ప్రవర్తన గురించి ఆసక్తికర నిజాలను చెప్పింది. గంజాయి తాగిన తర్వాత గాగ్రాచోలీ వేసుకుని రాధలా తయారయ్యేవాడట. మేకప్ - ఎయిర్ విగ్ ను కూడా ధరించేవాడు. గంజాయి శివుడి ప్రసాదం - దాన్ని ఎలా వద్దంటాను అని అనేవాడని పేర్కొంది. కృష్ణుడే రాధ - రాధే కృష్ణుడు అంటూ ఆ దుస్తులను వేసుకునేవాడు. తన చదువు గురించి కూడా తేజ్ ప్రతాప్ తక్కువగా మాట్లాడేవాడు అని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొంది.