Begin typing your search above and press return to search.
మేకిన్ ఇండియా యుద్ధ విమానం అదుర్స్
By: Tupaki Desk | 24 Jan 2016 7:14 AM GMTప్రధాని మోడీ చేపట్టి మేకిన్ ఇండియా క్యాంపెయిన్ క్రమంగా ఫలితాలనిస్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి యుద్ధ విమానాన్ని తయారుచేసి మేకిన్ ఇండియాకు అర్థం చెప్పారు భారత రక్షణ శాస్త్రవేత్తలు. ఇది బహ్రెయిన్ లో జరుగుతున్న ఎయిర్ షోలో తన తడాఖా చూపించింది కూడా. తేజాస్ పేరుతో పిలుస్తున్న ఈ యుద్ధ విమానాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో రూపొందించడం విశేషం.
మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారైన ఈ తేజాస్ బహ్రెయిన్ లోని సఖీర్ ఎయిర్ బేస్ లో నిర్వహిస్తున్నఅంతర్జాతీయ వైమానిక ప్రదర్శనల్లో పాల్గొంది. ఈ విన్యాసాలను తిలకించడానికి ఇండియా నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అక్కడికి వెళ్లారు. గాల్లో చక్కర్లు కొడుతూ శరవేగంగా ఆకాశం నుంచి నేల వరకు వచ్చి మళ్లీ అంతేవేగంగా పైకి దూసుకెళ్లడం వంటి తేజాస్ అవలీలగా చేసి చూపించింది. దీంతో ఈ మేకిన్ ఇండియా యుద్ధ విమానం ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది.