Begin typing your search above and press return to search.

పెండింగ్ చాలన్ల ఆఫర్ బుట్టదాఖలు.. ఎమ్మెల్యేలవీ భారీ బకాయిలు

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 AM GMT
పెండింగ్ చాలన్ల ఆఫర్ బుట్టదాఖలు.. ఎమ్మెల్యేలవీ భారీ బకాయిలు
X
ఈ-చాలన్... తెలంగాణలో రోడ్ల మీద వెళ్లే వాహనదారులకు ఈ పదం అంటే భయపడుతారు. రోడ్డుపై యాష్ డ్రైవింగ్ చేసినా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని మళ్లించినా.. రోడ్డు క్రాస్ చేసినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఫైన్ ను ఇంటికి ఈ చాలన్ ద్వారా పంపిస్తారు. దీంతో చచ్చుకుంటూ ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. మూడు సార్లు అలా జరిగితే లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించే జరిమానాలను చెల్లించడానికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజుల క్రితం ఓ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పెండింగ్ చాలన్లపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ను అందించారు. అధికారులు తెలిపిన నిర్ణీత సమయంలో చలాన్లు చెల్లించిన వారికి ఈ సదుపాయాన్ని అందించారు. ఈ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకున్నారు.

తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాత్రం ఈ ఆఫర్ ను వినియోగించుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్ లో పేర్కొన్న పెండింగ్ చలాన్లను సదురు ప్రజా ప్రతినిధులు ఇంకా చెల్లించలేదు.

మొత్తం 8మంది ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ చలాన్లను చెల్లించాల్సి ఉంది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఇంతకీ చలాన్లు చెల్లించని ఆ నాయకులు ఎవరు? వారి పేర్లపై ఎంత మొత్తం పెండింగ్ లో ఉందని ఆరాతీస్తే షాకింగ్ లెక్కలు బయటపడ్డాయి.

మంత్రి శ్రీనివాసగౌడ్ పై రూ.1035 పెండింగ్ చలాన్ ఉంది. ఇక మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మొత్తం 2 చలాన్లు రూ.2070 చెల్లించాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నాయకుడు కొనేరు కోనప్ప పేరు మీద రూ.300 పెండింగ్ చలాన్ ఉంది. సీహెచ్ మధన్ రెడ్డి (టీఆర్ఎస్) పేరు మీద రెండు చలాన్లపై రూ.1935 పెండింగ్ ఉంది. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై మొత్తం రూ.5310 విలువైన 6 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి.ఎంఐఎం పార్టీ నాయకుడు అహ్మద్ బలాలాపై రూ.3840 విలువైన 7 చలాన్లు ఉన్నాయి.