Begin typing your search above and press return to search.

క‌విత‌పై క‌మ‌లనాథుల క‌న్నెర్ర‌

By:  Tupaki Desk   |   19 Sep 2016 11:30 AM GMT
క‌విత‌పై క‌మ‌లనాథుల క‌న్నెర్ర‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు వింటేనే తెలంగాణ కాషాయ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేంద్రంపై అవసరాలకు అనుగుణంగా సందర్బోచితంగా వ్యాఖ్యలు చేయడం పట్ల నేతలు జీర్ణించుకోవడంలేదు. కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించిన సందర్బంగా ఆమె కేంద్రాన్ని పొగడటం - తదంతనరం దుమ్మెత్తి పోయడం పట్ల గులాబీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అద్య‌క్షుడు అమిత్ షా వ‌రంగ‌ల్‌ లో నిర్వ‌హించిన స‌భ అనంత‌రం ఎంపీ కవిత చేసిన కామెంట్ల‌పై బీజేపీ నాయ‌కులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే ఎంపీ క‌విత విమ‌ర్శ‌ల‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసినా కేంద్ర మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదనలు పార్టీ నేత‌ల్లోనే వినిపించ‌డం ఆస‌క్తిక‌రం.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన చక్కటి పథకం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యమేమిటంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు వారి అభిరుచి మేరకు.. వారికి నచ్చిన ఫీల్డ్‌లోశిక్షణ ఇప్పించడం.. వారిలో ఉన్న నైపుణ్యాన్ని ద్విగుణీకృతం చేయడం.. ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కలిపించడం..ఇందుకోసం స్కిల్ డెవలప్‌ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌ షిప్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.. ప్రస్తుతం ఈ శాఖకు రాజీవ్ ప్రతాప్ రూడి మంత్రిగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా అవసరమైన సహకారం అందిస్తోంది.. ఇప్పటికే ఈ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ యువజన కేంద్రాలతో పాటు రాష్ట్రాలలో చురుగ్గా పని చేస్తున్న ఎన్జీవోలకు నిధులు సమకూరుస్తోంది.. వాటి ద్వారా స్కిల్ డెవలప్‌ మెంట్ శిక్షణ కేంద్రాలలో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించే ప్రక్రియను అమలు చేస్తోంది. కేంద్రం లెక్కల ప్రకారం గడచిన రెండేళ్లలో నైపుణ్య శిక్షణల కోసం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట! రానున్న రెండేళ్లలో మరో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులతో దేశమంతటా 25 వేల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఇటీవలే ప్రకటించారు కూడా!

ఇదిలాఉండ‌గా ఇటీవ‌లే ఎంపీ క‌విత త‌న సార‌థ్యంలోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ ను ఏర్పాటు చేసి, కేంద్రమంత్రులను ఆహ్వానించి వారిచే ప్రారంభోత్సవం చేయించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సాక్షాత్తు కేంద్ర మంత్రి రాజీవ్ ప్ర‌తాప్ రూడీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జాగృతి తీరును పొగిడేశారు. అయితే ఈ ప‌రిణామంపై బీజేపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. కేంద్రం సొమ్ముతో తెలంగాణ జాగృతిని క‌విత‌ ప్రమోట్ చేసుకుంటున్నార‌ని కస్సుమంటున్నారు.

కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న నైపుణ్య శిక్షణ కేంద్రాల తీరు పట్ల బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు.. సంఘ్ పరివార్‌ లోని వివిధ విభాగాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట! రాష్ట్రంలో నిబద్దతతో...అంకితభావంతో పని చేసే అనేక ఎన్జీవో సంస్థలుండగా - కవిత సారథ్యంలోని జాగృతికే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కమలదళ సభ్యులు మండిపతున్నారు. ఇలా మండిపడటానికి కూడా కారణాలున్నాయి. కేంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌ మెంట్ కేంద్రాలను కవిత తన సొంత ప్రచారానికి వాడుకుంటోందని.. జాగృతి సొంత నిధుల తో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతోందని కాషాయదండు కుమిలిపోతున్నదట! జాగృతిని ప్రమోట్ చేసుకునేందుకు కేంద్రం సొమ్మును కవిత ఉపయోగిస్తున్నారన్నది బీజేపీ నేతల ఆరోపణ! జాగృతి ప్రమోషన్ ద్వారా అంతిమంగా టీఆర్ ఎస్ పార్టీకే ప్రయోజనం చేకూరుతుందని వాపోతున్నారట కూడా! పైగా శిక్షణ కేంద్రాలలో ఉన్న అభ్యర్థులను జాగృతి క్యాడర్‌ గా మలుచుకునే ప్రయత్నం కూడా జరుగుతోందని తెలంగాణ కమలనాథుల ప్రధాన ఆరోపణ.

తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్‌ మెంట్ కేంద్రాల ఏర్పాటుపై కొద్ది రోజుల కిందట నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగిందట! జాగృతి తీరుపై తెలంగాణలోని మెజారిటీ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట! పార్టీతో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సంబంధాలున్న ఎన్నో ఎన్జీవోలు.. ఇతర సంస్థలు దశాబ్దాలుగా ఎలాంటి ప్రచారం లేకుండానే క్రియా శీలకంగా పని చేస్తున్నాయని.. ప్రజలతో మమేకమయ్యాయని.. అలాంటి వాటికి ఈ బాధ్యతను అప్పగించకుండా టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ జాగృతికి ప్రాధాన్యత ఇవ్వడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ బాగుపడినట్టేనని చికాకుపడుతున్నారు.అయితే..జాగృతి తీరుపై ఫిర్యాదులు చేసినా. కేంద్రం లైట్ గా తీసుకుంటున్నార‌ని స‌మాచారం. దీంతో ఈ టేకిట్ ఈజీ నెస్‌ ను తెలంగాణ క‌మ‌లనాథులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.