Begin typing your search above and press return to search.
ఆంధ్రా పోలీసులకు థ్యాంక్స్ - 'తెలంగాణ'
By: Tupaki Desk | 1 Oct 2015 5:30 PM GMTప్రాంతాలుగా విడిపోదాం.. తెలుగువారిగా కలిసి ఉందామని తెలంగాణ ఉద్యమనేతలు ఉద్యమ సమయంలో చెప్పినట్లే ప్రజల మధ్య పెద్దగా విబేధాలు లేనప్పటికీ.. రాజకీయం పుణ్యమా అని ఇరు ప్రాంతాల్లోని వారి మధ్య సందేహాలు చాలానే ఉన్నాయి. రాజకీయ లబ్థి కోసం భావోద్వేగాలు టచ్ చేసేందుకు ఏదో ఒక అంశాన్ని ప్రస్తావించటం మామూలే.
ఇంత గందరగోళంలోనూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య మాత్రం చక్కటి సంబంధాలే ఉన్నాయి. ఇక.. పోలీసుల విషయంలోనూ అలాంటిదే ఉందన్న విషయాన్ని నిరూపించారు ఏపీ పోలీసులు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడ్ని కిడ్నాప్ చేసిన వారిని అదుపులోకి తీసుకోవటాన్ని పలువురు తెలంగాణవాదులతో పాటు.. ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సుమన్ నాయక్ అనే బాలుడ్ని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సదరు ముఠా తెలంగాణ దాటి ఏపీలోని ప్రకాశం జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద కిడ్నాపర్ల వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో అక్కడి పోలీసులకు సందేహం వచ్చింది. కిడ్నాపర్లను ఫాలో అయిన పోలీసుల్ని చూసి కిడ్నాపర్లు పరుగులు పెట్టారు.
సినిమా రేంజ్ లో ఛేజ్ జరగటం.. చివరకు ఆ బాలుడ్ని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు తప్పించారు. ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మరో ఇద్దరి కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకుతున్నారు. ఏపీ పోలీసుల చొరవను తెలంగాణ ప్రాంతీయులే కాదు.. ఏపీ ప్రజానీకం కూడా హర్షిస్తోంది.