Begin typing your search above and press return to search.
ఆ రూలే లేకుండా ‘అసెంబ్లీ’ గురించి ఆలోచించే వారే కాదేమో?
By: Tupaki Desk | 6 Sep 2021 1:11 AM GMTమరోసారి తెలంగాణాలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల చర్చ మొదలైంది. దీనికి కారణం.. ఆ మధ్యన బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన సభ ముగిసి దగ్గర దగ్గర ఆర్నెల్లు కావొస్తోంది. దీంతో.. దీనిప్రస్తావన వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రతి ఆర్నెల్లకు ఒక దఫా తప్పనిసరిగా సమావేశాల్ని నిర్వహించి ఉంటుంది. తాజాగా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. ఈ నెల 26లోపు కచ్ఛితంగా సమావేశాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో.. అసెంబ్లీ సమావేశాల గురించి అసలు ఆలోచించే వారే కాదేమో?
ఈ ఏడాది మార్చి 15 నుంచి 26 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆర్నెల్లకు ఒకసారి అసెంబ్లీ సమావేశాన్ని కొలువుతీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ నెల 26 లోపు సభను నిర్వహించాలి. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చిలో.. వర్షాకాల సమావేశాలు జులై.. ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. కరోనా కారణంగా సమావేశాలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. అందులో పస లేదనే చెప్పాలి.
ఎందుకంటే.. ఇదే ప్రభుత్వం వేలాది మందితో భారీ సభల్ని నిర్వహించటం.. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టటం.. ఘనంగా ప్రారంభోత్సవాలు చేపట్టే విషయంలో లేని ఇబ్బంది అంతా.. పరిమిత సంఖ్యలో సమావేశాల్ని నిర్వహించేందుకు వచ్చిన కష్టం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. రూల్ ఉంది కాబట్టి.. ఈ మాత్రమైనా అసెంబ్లీ సమావేశాల గురించి చర్చ జరుగుతుంది కానీ.. లేకుండా అలానే వదిలేసే వారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వర్షాకాల సమావేశాల్ని వారం నుంచి పది రోజుల వరకు జరిపే వీలుంది.
అయితే..మొన్నటివరకు అసెంబ్లీ సమావేశాల గురించి ఆలోచించని సర్కారు.. ఇప్పుడు హటాత్తుగా ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం.. రూల్ ప్రకారం సభను నిర్వహించాల్సి ఉండటమే. దీనికి సంబంధించిన విషయాన్ని మర్చిపోయిన అధికారులు.. తాజాగా గడువు గుర్తుకు రావటంతో హడావుడిగా పనులు మొదలు పెట్టినట్లుగా చెబుతారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉండటంతో.. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చినంతనే.. ఆయన ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశాన్ని ముందు ఉంచుతారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ నెల 15 నుంచి 20 మధ్యలో సమావేశాల్ని నిర్వహించి.. రూల్ బుక్ ను పక్కాగా ఫాలో అవుతున్నట్లుగా చెప్పుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.