Begin typing your search above and press return to search.
రాజగోపాల్ రెడ్డి వర్సెస్ తలసాని.. కేటీఆర్ ఫైర్..అసెంబ్లీలో రచ్చ
By: Tupaki Desk | 14 March 2022 4:30 PM GMTతెలంగాణ అసెంబ్లీలో సోమవారం బిగ్ ఫైట్ నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, మంత్రి తలసాని కాంట్రాక్టర్ తో పోల్చారు. దీంతో వివాదం రాజుకుంది. ఆయన కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్లపై మాట్లాడుతారని అన్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేకాట ఆడిన వాళ్లు మంత్రులు కావచ్చని అన్నారు. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కావొద్దా? అంటూ ప్రశ్నించారు.
దీంతో అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. 'అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ' సభలోపల ఎమ్మెల్యేలు, సభ యబట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీనే అవినీతి పార్టీ అని.. టీఆర్ఎస్ పార్టీ కాదని కేటీఆర్ అన్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు.