Begin typing your search above and press return to search.
నివాళిలోనూ ‘ఏకగ్రీవ’ రాజకీయమేంది?
By: Tupaki Desk | 23 Sep 2015 11:46 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటీవల మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ సంతాప తీర్మానాలు చేపట్టారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డికి మృతికి తన సంతాప తీర్మానంపై మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు.
సంతాప తీర్మానంపై హుందాగా ప్రసంగం చేస్తే బాగుండేదని.. దాన్నో రాజకీయ వేదికగా మార్చుకోవటం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిష్ణారెడ్డి మృతికి నివాళులు అర్పించే సయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రులు డీకే అరుణ.. గీతారెడ్డిలు మాట్లాడే సందర్భంగా కిష్ణారెడ్డి మరణంతో జరిగే నారాయణఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రబుత్వాన్ని కోరటం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది.
ఏకగ్రీవం అన్నది రాజకీయపార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకునే వ్యవహారమే తప్పించి.. దాన్ని అధికారికం చేసే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారపక్షంతో పాటు విపక్షాలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకునే వేదికలు చాలానే ఉన్న నేపథ్యంలో.. ఏకగ్రీవ ఎన్నికల వ్యవహారాన్ని అసెంబ్లీలో.. అదీ సంతాప తీర్మానం సందర్భంగా ప్రస్తావించటం చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ఉప ఎన్నికల అంశాన్ని తీసుకొచ్చి.. అన్నీ పార్టీలను.. అధికారపక్షాన్ని కాంగ్రెస్ నేతలు ఒప్పిస్తే సరిపోయేదానికి.. అసెంబ్లీలో ప్రస్తావించటం.. ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయంగా చెబుతున్నారు.
పక్కనున్న ఏపీలో ఇదే కాంగ్రెస్ పార్టీ.. మృతి చెందిన ఎమ్మెల్యే ఎన్నికల్ని ఏకగ్రీవం చేసేందుకు ససేమిరా అంటూ.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తుంది. హుందాగా సాగాల్సిన సంతాప తీర్మాన సమయంలో రాజకీయాలు సరికావని.. సీనియర్ నేతలు అయి ఉండే ఇలా వ్యవహరించటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.