Begin typing your search above and press return to search.
తెలంగాణ అసెంబ్లీ...జస్ట్ 8 నిమిషాలే
By: Tupaki Desk | 30 April 2017 8:22 AM GMTఆదివారం పూట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిజంగానే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కేవలం 8 నిమిషాలు మాత్రమే సభ నడిచి అనంతరం నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతి మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రాష్ట్ర భూ సేకరణ బిల్లుకు సవరణలను ప్రతిపాదించారు. బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు.
భూసేకరణ చట్ట సవరణల బిల్లును డిప్యూటీ సీఎం - రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. కేంద్రం సూచన మేరకు భూసేకరణ చట్టం బిల్లులో స్వల్ప మార్పులు చేశారు.
కాగా, భూసేకరణ బిల్లు సవరణకు కేంద్రం సూచించిన ప్రతిపాదనలను ఆమోదించడానికే ఆదివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఉభయ సభల్లోనూ భూసేకరణ బిల్లు సవరణ అంశం తప్ప, మిగతావేవీ చర్చించేది లేదని ప్రభుత్వం ముందురోజే తేల్చిచెప్పింది. శనివారం శాసనసభలో సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం సమాచారం ఇస్తూ.. గతంలో చేసిన భూసేకరణ చట్టంపై కేంద్రప్రభుత్వం సూచించిన సవరణలు చేసేందుకే సమావేశం నిర్వహించాల్సి ఉన్నదని, కేవలం ఒక్క ఈ అంశానికే పరిమితమై సమావేశాన్ని పెట్టాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీఏసీ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి - ప్రతిపక్ష నేత కే జానారెడ్డి - ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి - ఎంఐఎం నుంచి సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ పాల్గొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/