Begin typing your search above and press return to search.

కొత్త రెవెన్యూ బిల్లుకు సభ ఆమోదం

By:  Tupaki Desk   |   11 Sep 2020 5:28 PM GMT
కొత్త రెవెన్యూ బిల్లుకు సభ ఆమోదం
X
తెలంగాణలో భూ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. వీరఆర్వోల వ్యవస్థ రద్దుతో పాటు కొత్తగా రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్....సమగ్ర భూ సర్వేతోనే భూ పంచాయతీలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో `కొత్త రెవెన్యూ బిల్లు` ఎటువంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందింది. రెవెన్యూ బిల్లును శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించింది. `తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్ -2020ను సహ ఆమోదించింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తాను ప్రతిపాదించిన సవరణలు వెనక్కు తీసుకోవడంతో ఎటువంటి సవరణలు లేకుండానే `తెలంగాణ భూమి హక్కులు - పట్టాదారు పాస్ బుక్‌ ల బిల్లు-2020`కు ఆమోదం లభించింది.

ఈ బిల్లును సభ ఆమోదించడంతో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దయిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఎమ్మార్వోలకే భూముల రిజిస్ట్రేషన్ - మ్యుటేషన్ అధికారం దక్కనుంది. తెలంగాణ ధరణి పోర్టల్ లో ఇకపై రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు - దేవాదాయ - వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దేవాదాయ - వక్ఫ్ భూములు క్రయ - విక్రయాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామని కేసీఆర్ అన్నారు.ఆ భూముల పరిరక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమగ్ర భూ సర్వే పూర్తయితేనే భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

అటవీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందరిచ ఒక్క గుంట కూడా కానివ్వకుండా చూస్తామన్నారు. పోడు భూములు సాగు రైతులకు పట్టాలిస్తామని, సాదాబైనామా విషయంలో లిబరల్ గా వ్యవహరించామని చెప్పారు. అవసరమైతే జీవో 58 - జీవో 59ని పొడిగిస్తామన్నారు. గతంలో భూ పంపిణీ అస్తవ్యస్తంగా చేసి గత పాలకులు చేతులు దులుపుకున్నారని, అందుకే భూములకు మించి సర్టిఫికెట్లు ఉన్నాయని అన్నారు. స్థలం లేకుండా ఇష్టా రాజ్యంగా సర్టిఫికేట్లు ఇచ్చారనిచ గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్ ఓఎఫ్ ఆర్ సర్టిఫికేట్లు పట్టా సర్టిఫికెట్లు కావని అన్నారు. ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టాలకు ధరణి పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ ఉంటుందని తెలిపారు. సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత భూములపై క్లారిటీ వస్తుందన్నారు.