Begin typing your search above and press return to search.
తెలంగాణ అసెంబ్లీని అలా ‘సెట్’ చేస్తున్నారట
By: Tupaki Desk | 21 Aug 2020 8:50 AM GMTకరోనా నేపథ్యంలో అన్ని మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొంది. ప్రపంచ బతుకుబండిని మార్చేసిన ఈ మహమ్మారి పుణ్యమా అని.. చాలా అంశాల్లో కొత్త ఏర్పాట్లు తప్పనిసరిగా మారింది. మొన్నటికి మొన్న పార్లమెంటు సమావేశాల్ని నిర్వహించేందుకు.. ఉభయ సభల్ని ఒకేసారి కొలువు తీర్చి.. లోక్ సభ ఒకసారి.. రాజ్యసభ ఒకసారి నిర్వహించాలని డిసైడ్ చేయటం తెలిసిందే. లోక్ సభ సభ్యలు భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న సీటింగ్ సరిపోకపోవటంతో.. ఈ ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వర్షాకాల సమావేశాల భాగంగా తెలంగాణ అసెంబ్లీని వచ్చే నెల ఏడో తేదీన షురూ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పుడున్న సీటింగ్ ను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక సీటులో ఇద్దరు కూర్చోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా సీటుకు ఒకరు చొప్పున సభ్యులు కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
కరోనా నేపథ్యంలో పాటించే భౌతిక దూరానికి తగ్గట్లే.. సభ్యుల సీటింగ్ పైన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంతరెడ్డి.. శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహాచార్యుల బృందం సమావేశం కావటమే కాదు.. స్వయంగా వెళ్లి పరిశీలించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో సీట్లు 151 ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న భౌతిక దూరం నిబంధనల ప్రకారం మరో 42 సీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక.. శాసన మండలి విషయానికి వస్తే.. మొత్తం 40 మంది సభ్యులున్న ఆ సభలో ప్రస్తుతం 36 మందే ఉన్నారు. దీనికి బదులుగా అక్కడ 80 సీట్లు ఉండటంతో.. ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితి. దీంతో.. మండలిలో మార్పు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. అసెంబ్లీలో మాత్రం అదనపు సీట్ల ఏర్పాటుతో పాటు.. గతంలో మాదిరి ఈసారి సమావేశాలకు విజిటర్స్ ను అనుమతించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఎందుకంటే.. విజటర్స్ గ్యాలరీలోనూ మీడియాకే సరిపోతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.