Begin typing your search above and press return to search.

పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లే టీ అసెంబ్లీ సమావేశాల డేట్ ఇదే

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:48 AM GMT
పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లే టీ అసెంబ్లీ సమావేశాల డేట్ ఇదే
X
ఎన్నికలు మరో ఏడాది ఉన్నప్పటికి.. ఒకవైపు ముందస్తు.. మరోవైపు కేంద్రంలో లొల్లితో పాటు.. తెలంగాణ అధికారపక్షం ప్రాంతీయం నుంచి జాతీయ పార్టీ దిశగా మారిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాజకీయపార్టీలు యాక్టివేట్ కావటంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. ఇలాంటి వేళ.. పొలిటికల్ హీట్ ను మరింత పెంచేసే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ వచ్చేసింది.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్ని ఈ నెల 19 (సోమవారం) నుంచి ప్రారంభమయ్యే వీలుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తాజా అసెంబ్లీ సమావేశాల సెషన్ మూడు నుంచి ఐదు రోజుల మధ్య జరిగే వీలుందని చెబుతున్నారు. డిసెంబరులో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించటం తెలిసిందే.

ప్రస్తుతం కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్న రీతిలో పలు పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్రంలోని మోడీ సర్కారును ఎండగట్టేందుకు.. తెలంగాణ సెంటిమెంట్ ను మరింత రాజేసేందుకు ఈ సమావేశాల్ని అస్త్రంగా వాడుకోనున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం విధానాలతో తెలంగాణ ఎంత నష్టపోతుందన్న విషయాన్ని వివరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఏమైనా ఈ అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు. రాజకీయంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు.. కేంద్ర విచారణ సంస్థలు తమను ఎంతలా టార్గెట్ చేశాయన్న విషయాన్ని తాజా సమావేశాల ద్వారా తన వాణిని తెలంగాణ అధికారపక్షం వినిపించనుంది. మొత్తంగా ఇప్పటికే ఉన్న హీట్ ను మరింత పెంచేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పాలి.