Begin typing your search above and press return to search.

బాహుబ‌లి సినిమా చూడ‌లేదా క‌డియం!

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:36 AM GMT
బాహుబ‌లి సినిమా చూడ‌లేదా క‌డియం!
X
అంద‌రికి తెలిసిన పాత్ర‌ల గురించి మాట్లాడేట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త అవ‌స‌రం. ఏ మాత్రం తేడా వ‌చ్చినా అభాసుపాలు కావ‌టం ఖాయం. తాజాగా క‌డియం శ్రీ‌హ‌రి మాట‌లు ఇదే రీతిలో ఉన్నాయ‌ని చెప్పాలి. తెలుగువారికి సుప‌రిచిత‌మైన బాహుబ‌లిలోని పాత్ర‌ల్ని పోల్చి చెప్పే ప్ర‌య‌త్నంలో ఆయ‌న మాట‌లు అత‌క‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అస‌లు.. బాహుబ‌లి సినిమాను క‌డియం శ్రీ‌హ‌రి చూశారా? అన్న సందేహం క‌లిగేలా ఉన్నాయి.

ఇంత‌కీ ఆయ‌న పోల్చిన పోలికను చూస్తే.. రాజ‌కీయాల్లో బాహుబ‌లి ఒక్క‌డే ఉంటార‌ని.. అలాంటి వ్య‌క్తి కేసీఆరేన‌ని క‌డియం స్ప‌ష్టం చేశారు. ఈ పోలిక వ‌ర‌కూ ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. అయితే.. ఆ త‌ర్వాత చెప్పిన పోలికే ఏ మాత్రం సూట్ కాని రీతిలో ఉంది. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ క‌ట్ట‌ప్ప లాంటి చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టింద‌ని ఎద్దేవా చేశారు. బాబును క‌ట్ట‌ప్ప‌తో పోల్చ‌టం ద్వారా ఆయ‌న ఎవ‌రికి బానిస? అన్న ప్ర‌శ్న‌ను రేకెత్తేలా చేశార‌ని చెప్పాలి.

బాహుబ‌లి మూవీలో అనుకోని రీతిలో క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడుస్తారే త‌ప్పించి.. విధేయుడిగా ఉండ‌టం క‌నిపిస్తుంది. కానీ.. బాబును తిట్ట‌ట‌మే ల‌క్ష్య‌మైన‌ప్పుడు ఆయ‌న్ను క‌ట్ట‌ప్ప‌తో పోల్చ‌టం.. కాంగ్రెస్ తో పొత్తు ముచ్చ‌ట‌ను అత‌క‌ని రీతిలో ఉదాహ‌ర‌ణ చెప్ప‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఇలా అర్థం ప‌ర్థం లేని రీతిలో ఇలా పోలిక‌లు పోలిస్తే.. అభాసుపాలు కారా క‌డియం? ఇంత‌కీ మీరు బాహుబ‌లి సినిమా చూడ‌లేదా..?