Begin typing your search above and press return to search.
కొత్త రూల్ రాలేదు.. భారీగా ఫైన్ వేశారు
By: Tupaki Desk | 12 Sep 2019 7:36 AM GMTకొత్త వాహన చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర నిర్ణయంపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా.. మరికొన్ని రాష్ట్రాలు ప్రతికూలంగా.. ఇంకొన్ని రాష్ట్రాలు తటస్థంగా ఉండటం తెలిసిందే. నిబంధనల్ని అతిక్రమించిన వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధించాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. అయితే.. ఇటీవల మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జరిమానాల్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఇదిలా ఉంటే.. కొత్త చట్టం అమల్లోకి రాకముందే తెలంగాణలో భారీ ఫైన్ ఒకటి పడిపోయింది.
మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న ఒక వ్యక్తికి నల్గొండ జిల్లా పోలీసులు రూ.10వేల జరిమానాను విధించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా అతన్ని కోర్టుకు హాజరుపర్చగా.. రూ.10వేల జరిమానా విధిస్తూ ఆదేశాల్ని జారీ చేశారు. ఈ నేరానికి మామూలుగా రూ.2వేల జరిమానా విధించి.. కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు. తొలిసారి నేరం చేసినందుకు రూ.10వేల జరిమానా విధిస్తున్నామని.. ఒకవేళ ఫైన్ కట్టకుంటే 15 రోజులు జైల్లో ఉండాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
కొత్త చట్టం అమల్లోకి రాక ముందే ఇంత భారీగా జరిమానాను ఎలా విధిస్తారన్న సందేహానికి నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసుల్లో కోర్టుదే తుది నిర్ణయమన్నారు. దానికి.. వాహన చట్టానికి సంబందం ఉండదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసు మినహా హెల్మెట్ ధరించకపోవటం.. మైనర్ డ్రైవింగ్.. రాంగ్ రూట్ లో ప్రయాణింటం లాంటి కేసుల్లో మాత్రం జీవో ఆధారంగా ఫైన్లు ఉంటాయన్నారు. సో.. తాగి వాహనం నడిపే వేళ.. జాగ్తత్త చాలా అవసరం. లేకుంటే తిప్పలు తప్పవు మరి.