Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ది రాజ‌కీయ పార్టీనా? బ్రోక‌రేజీ సంస్థ‌నా?

By:  Tupaki Desk   |   22 Jan 2018 9:24 AM GMT
ప‌వ‌న్ ది రాజ‌కీయ పార్టీనా? బ్రోక‌రేజీ సంస్థ‌నా?
X
తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న మొద‌లు పెట్టారో లేదో.. బీజేపీ తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని సంధించ‌టం షురూ చేసింది. తాజాగా బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణ సాగ‌ర్ రావు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ద‌క్షిణ భార‌తంలో పెరియార్ స్ఫూర్తితో వ‌స్తున్న‌ట్లు చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ వి ప్రాంతీయ వాదంతో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా మండిప‌డ్డారు.

జ‌న‌సేన రాజ‌కీయ సంస్థా? బ్రోక‌రేజీ సంస్థ‌నా? అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌.. ప‌వ‌న్ పార్టీకి జెండా.. లోగో మాత్ర‌మే ఉన్నాయి కానీ.. డెరెక్ష‌న్ లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వ్య‌తిరేకి ప‌వ‌న్ క‌ల్యాణ్ అని.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అమ‌రవీరులు.. కేసీఆర్ కుటుంబంపై ఆయ‌న అనేక వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఆరోపించారు.

ఎలాంటి డైరెక్ష‌న్ లేని జ‌న‌సేన‌.. విడుద‌ల‌కు ముందే ఫెయిల్ అయ్యింద‌న్నారు. కేసీఆర్ కుటుంబంపై ప‌వ‌న్ గ‌తంలో ప‌లు విమ‌ర్శ‌లు చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని పొగ‌డ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ బీ టీం అని.. ఆయ‌న పార్టీది భ‌జ‌న పార్టీగా అభివ‌ర్ణించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ వ్య‌తిరేక ఓటును చీల్చ‌టానికి కేసీఆర్ ప్ర‌యోగిస్తున్న పావు ప‌వ‌న్ గా అభివ‌ర్ణించారు. తెలంగాణ‌లో కేసీఆర్ ను పొగ‌టం అంటేనే ప్యాకేజీల పార్టీగా క‌నిపిస్తోంద‌న్నారు. జ‌నసేన పార్టీలో కార్య‌క‌ర్త‌లు లేర‌ని.. కేవ‌లం అభిమానుల‌తో ప‌వ‌న్ హ‌డావుడి చేస్తున్నార‌న్నారు.

రాజ‌కీయం అంటే.. ఏపీలో పెరుగ‌న్నం తిని.. తెలంగాణ‌లో బిర్యానీ తిన‌టం కాద‌న్న ఆయ‌న‌.. దేశంలో అత్య‌ధిక రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగినా ప‌ట్టించుకున్న‌ది లేద‌న్నారు ప‌వ‌న్ యాత్ర‌కు దిక్కు మొక్కు లేద‌ని.. యాత్ర‌కు దారి తెన్నూ లేద‌న్నారు. కేసీఆర్ ను పొగుడుతున్న తీరు చూస్తే.. ప్యాకేజీల కోస‌మే అన్న‌ట్లుగా మారిందంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌న్ యాత్ర షురూ అయ్యిందో లేదో.. అప్పుడే ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు మొద‌లు కావ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ తీవ్ర‌త మ‌రింత పెరగ‌టం ఖాయమంటున్నారు. ప‌వ‌న్ నోరు తెర‌వ‌క ముందే విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు ఇంత బ‌లంగా ఉన్న వేళ‌.. పెరిగే ఎండ‌ల‌కు త‌గ్గ‌ట్లే విమ‌ర్శ‌లు అంతే తీవ్ర‌మ‌వుతాయ‌న్న మాట వినిపిస్తోంది.

మరోవైపు ప్రకాశ్ రాజ్ పైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ఏమాత్రం విజయ పరిజ్ఞానం లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ - బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలు హిందువులు కాదని అనడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. గౌరీ లంకేష్ మృతి పట్ల స్పందించకపోతే హిందువు కానట్లేనా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేరళలో 19 మంది ఆరెస్సెస్ యువకులు చనిపోతే ప్రకాశ్ రాజ్‌ కు బాధ అనిపించలేదా అని నిలదీశారు.