Begin typing your search above and press return to search.

ఆందోళ‌న‌లు చేద్దాం..పుంజుకుందాం:తెలంగాణలో బీజేపీ వ్యూహం!

By:  Tupaki Desk   |   27 May 2020 5:30 PM GMT
ఆందోళ‌న‌లు చేద్దాం..పుంజుకుందాం:తెలంగాణలో బీజేపీ వ్యూహం!
X
పాల‌కప‌క్షంపై పోరాటం చేసి పార్టీని ప‌టిష్టం చేస్తూనే పుంజుకుందామ‌ని తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు - వైఫ‌ల్యాల‌పై పోరాడుదామ‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోందంట‌. ఈ క్ర‌మంలోనే జూన్ నెల మొత్తం ఒకే అంశం ఆధారంగా ఉద్యమాలను నిర్వహించాలని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణయించారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాల్లో లోపాలను - ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయ‌ని - దీనిపై పోరాడ‌తామ‌ని నూత‌నంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియ‌మించ‌బ‌డిన‌ బండి సంజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ చిన్న అవ‌కాశం వ‌చ్చినా వ‌ద‌ల‌కుండా స‌ద్వినియోగం చేసుకుని పుంజుకునేందుకు బీజేపీ కాచుకు కూర్చుంది.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సమగ్ర వ్యవసాయ విధానంపై పోరాడేందుకు బీజేపీ సిద్ధ‌మైంది. వచ్చే నెల జూన్ మొత్తం రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇక కోర్ కమిటీలో చర్చించిన తర్వాత త్వరలో అధికారిక నిర్ణయం వెలువడే అవ‌కాశం ఉంది. ఇందులో భాగంగానే వచ్చే నెలలో చేసే కార్యక్రమాలపై కేంద్ర స‌హాయ మంత్రి కిష‌న్‌ రెడ్డితో - పార్టీ ముఖ్య నేతల సలహాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుని వారి సూచ‌న‌లు - ఆదేశాల‌కు అనుగుణంగా పార్టీని ప‌రుగెత్తించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఒక అస్త్రంగా చేసుకోనున్నారు. ఈ క్ర‌మంలో వ్య‌వ‌సాయ విధానంలో ఉన్న లోటుపాట్లను రైతులకు వివరించనున్నారు.