Begin typing your search above and press return to search.

టికెట్ల రేసులో అంత‌మంది.. గెలిచేదెంత‌?

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:30 AM GMT
టికెట్ల రేసులో అంత‌మంది.. గెలిచేదెంత‌?
X
ఇర‌గ‌దీస్తాం.. ప‌గ‌ల‌దీస్తాం.. ఈసారి మా స‌త్తా చాటుతాం. ఇలా అర‌వీర భ‌యంక‌ర మాట‌లు చెప్పి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన ఘ‌న చ‌రిత్ర తెలంగాణ బీజేపీ నేత‌ల సొంతం. మా స‌త్తా మీకు తెలీదు కానీ.. ఈసారి మాది సింగిల్ డిజిట్ కాదు.. డ‌బుల్ డిజిట్ అంటూ చెప్పిన మాట‌ల‌కు.. వ‌చ్చిన ఫ‌లితాల‌కు పొంత‌న లేని ప‌రిస్థితి.

సింగిల్ డిజిట్ ను అల‌వోక‌గా దాటేస్తామంటూ బ‌డాయి క‌బుర్లు చెప్పిన టీ క‌మ‌ల‌నాథులు.. చివ‌ర‌కు ఒక్క సీటుతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. షాకింగ్ ప‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం రియాక్ట్ అయ్యే ధైర్యం చేయ‌లేక మిన్న‌కుండిపోయిన ప‌రిస్థితి. ఫ‌లితాలు వెల్ల‌డై నెల‌న్న‌ర దాట‌టం.. ఎంపీ ఎన్నిక‌ల వేడి ఇప్పుడిప్పుడు రాజుకోవ‌టంతో జ‌రిగిపోయిన దానిని వ‌దిలేసి.. జ‌ర‌గాల్సిన దాని మీద దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా వారు చెబుతున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌లువురు బీజేపీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.

గెలిచేది ఎంత‌మంది అన్న‌ది ప‌క్క‌న పెడితే.. పోటీ చేయ‌టానికి మాత్రం భారీగానే పోటీ ప‌డుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మొన్న‌టి వ‌ర‌కూ ఎమ్మెల్యేలుగా ఉండి.. తాజా అసెంబ్లీలో ఘోర ప‌రాజ‌యం పొందిన క‌మ‌ల‌నాథులంతా ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ బ‌రిలోకి దిగేందుకు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒక్కో స్థానానికి ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు ఏకంగా ముగ్గురు వ‌ర‌కూ టికెట్ల‌ను ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ ఎక్కువ‌గా ఉంది. ఈ స్థానం నుంచి మ‌రోసారి బ‌రిలో దిగాల‌ని సిట్టింగ్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న బండారు ద‌త్తాత్రేయ ఆశిస్తుండ‌గా.. మ‌రో ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు ల‌క్ష్మ‌ణ్.. కిష‌న్ రెడ్డిలు ఇద్ద‌రూ ఈ స్థానం నుంచి త‌మ‌కు టికెట్ ద‌క్కితే బాగుండ‌ని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన నేప‌థ్యంలో ఎంపీ ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్నారు.

హైద‌రాబాద్ ఎంపీ స్థానానికి వ‌స్తే ఇక్క‌డ కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంది. వీహెచ్ పీ నేత భ‌గ‌వంత‌రావు.. శ్రీ‌పీఠం అధిప‌తి స్వామి ప‌రిపూర్ణానంద‌లు కూడా టికెట్ మీద ఆశ‌లు పెట్టుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ‌లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ సైతం హైద‌రాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశ‌లు పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

మ‌ల్కాజిగిరి స్థానం విష‌యానికి వ‌స్తే.. ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు.. పేరాల శేఖ‌ర్ రావు.. డాక్ట‌ర్ఎస్. మ‌ల్లారెడ్డి.. ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర పేర్లు వినిపిస్తున్నాయి. క‌రీంన‌గ‌ర్ టికెట్ రేసులో బండి సంజ‌య్.. సుగుణాక‌ర్ రావు.. జి.రామ‌కృష్ణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు కూడా క‌రీంన‌గ‌ర్ బ‌రిలో దిగొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. ఈ స్థానాలే కాదు.. మిగిలిన ఎంపీ టికెట్ల కోసం పోటీ అధికంగా ఉంది. టికెట్ల రేసులో ఇంత మంది ఉన్న‌ప్ప‌టికీ.. వీరిలో గెలుపు గుర్రాలు ఏవి? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.