Begin typing your search above and press return to search.
అడకత్తెరలో తెలంగాణ కమలం
By: Tupaki Desk | 1 Sep 2018 4:28 AM GMTతెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ముందు నుయ్యి.... వెనుక గొయ్యిలా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుపడండి అంటూ భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరినవన్నీ తీర్చేస్తున్నారు. అగ్ర నాయకుల ఈ ద్వంద వైఖరితో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇక్కడ తాము విమర్శిస్తూంటే కేంద్రంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రికి అనుకూలంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న జోనల్ వ్యవస్ధ - కొత్త జిల్లాలకు చెందిన గుర్తింపు వంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద వాపోయినట్లు సమాచారం. మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ పదాదికారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాను కలిసిన తెలంగాణ బిజేపీ నాయకులు ఈ ద్వంద విధానంపై అలకబూనినట్లు చెబుతున్నారు.
తెలంగాణ నాయకులు చెప్పిన విషయాలపై అమిత్ షా ఆసక్తిగా విన్నా.... తమకు తెలంగాణ రాష్ట్ర సమితితో వైరమే తప్ప స్నేహం లేదని తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు అన్ని పనులు చకచకా చేయడం వెనుక ఆయనకు లబ్ది చేకూర్చేందుకు కాదని, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇబ్బందుల పాలు చేసేందుకేనని అమిత్ షా చెప్పినట్లు బిజేపీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో ముమ్మాటికి ఒంటరిగానే పోటీ చేస్తామని - తెలంగాణ రాష్ట్ర సమితి తో పొత్తు కాని - స్నేహం కాని కొనసాగించమని అమిత్ షా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వంద సీట్లు వస్తాయని ఆ పార్టీ విశ్వసిస్తోందని, అది జరిగే పని కాదని కూడా అమిత్ షా చెప్పారు. దీంతో ఇక్కడ అధికారంలోకి రావడంపైనే ద్రష్టి పెట్టాలని అమిత్ షా తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఒక వేళ అధికారంలోకి రాకపోయినా కింగ్ మేకర్ గా బీజేపీయే వ్యవహరించాలని అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. జాతీయ అధ్యక్షుడు ఎన్ని చెప్పినా తెలంగాణ రాష్ట్ర సమితికి - భారతీయ జనతా పార్టీకి మధ్య ఏదో ఉందని ప్రజల్లోకి వెళ్లిపోయిందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వేసిన పాచికలో అటు జాతీయ నాయకులు - ఇటు రాష్ట్ర నాయకులు పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.