Begin typing your search above and press return to search.
టీ బీజేపీ..కొంత ఆశ...ఎంతో నిరాశ
By: Tupaki Desk | 11 March 2019 6:03 AM GMTపార్లమెంటు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై అందరి చూపు పడుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో - పార్లమెంటరీ పోరులో ఆ పార్టీల తీరుపై ఫోకస్ పడింది. లోక్ సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలూ సన్నద్ధమవుతుంటే.. బీజేపీ మాత్రం నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతోంది. అధికార టీఆర్ ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గాల తొలిదశ ప్రచారాన్ని పూర్తిచేసింది. టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఓ దఫా పార్లమెంటరీ నియోజకవర్గాల టూర్ పూర్తి చేశారు. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, బీజేపీలో సందడి లేకపోవడంతో కమలం నేతలు కలవరపడుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలయింది. 118 సీట్లకు బరిలో దిగిన ఆ పార్టీ ఒక్కస్థానంలోనే గెలుపొందింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకులు ఆ పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులెవరన్న దానిపై ఆ పార్టీలో స్పష్టత లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అందుకు తగ్గ కసరత్తు మాత్రం లేకపోవడంతో...బీజేపీ ఏ మేరకు తన ప్రభావం చూపనుందనే చర్చ తెరమీదకు వస్తోంది.
ఇదిలాఉండగా, ఒకట్రెండు రోజులలో బీజేపీ పోటీపై స్పష్టత వస్తుందని సమాచారం. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సోమవారం ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు సమాచారం అందింది. దీంతో ఆయన హుటాహుటిగా ఢిల్లీ బయల్దేరివెళ్లారు. ఈ సందర్భంగా లోక్ సభ అభ్యర్థులపై స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.