Begin typing your search above and press return to search.
టీ.బీజేపీ నేతల ముందస్తు వ్యూహం.!
By: Tupaki Desk | 2 March 2020 10:30 PM GMTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చివరి అంకానికి చేరుకుంది. పార్టీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతున్నారు. దీంతో అనేక కొత్త వ్యూహాలు బయటపడుతున్నాయి. ఇటీవల అధిష్టానం అధ్యక్ష ఎంపిక కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణలో మళ్లీ లక్ష్మణ్‌నే కొనసాగించాలని కొందరు ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. ఒకవేళ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే తమకే ఆ పదవీ ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నట్లు తెల్సింది.
*ముందస్తు వ్యూహాన్ని అనుసరిస్తున్న సీనియర్లు..
కొత్త నేతను ఎంచుకుంటే తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ముందుస్తు వ్యూహంలో భాగంగా సీనియర్లంతా లక్ష్మణ్ కే మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాకుండా డీకే అరుణ - ఎంపీ అర్వింద్ - అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు లాంటి నేతల పేర్లు అధక్ష్య పదవి రేసులో ఉన్నాయి. ఒకవేళ వీరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే, తమ పెత్తనం సాగదన్న అభద్రతాలో సీనియర్లు ఉన్నారు. అదేవిధంగా ఆయనకు జిల్లాల్లో పెద్దగా ఫాలోవర్స్ లేరు. కావున సీనియర్లంతా పార్టీపై తమ పెత్తనం కొనసాగించవచ్చని భావిస్తున్నారు.
*లక్ష్మణ్ వైపు మొగ్గుతున్న సీనియర్లు..
ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ నే తిరిగి ఎన్నుకోవాలని సీనియర్లు భావిస్తున్నారు. ఆయనకు జిల్లాలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రమంతా ప్రభావం చూపలేరని సీనియర్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఆయనకు అంగ బలం లేదు, అర్ధబలం అంతకన్నా లేదు. దీంతో భవిష్యత్తులో తమకు ప్రమాదం కాడనే ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఈ కారణాల వల్లనే లక్ష్మణ్ నే మళ్లీ దాదాపు ఫైనల్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అధక్ష్య పదవి నుంచి తొలగించాలనుకున్న నేతలు ఇప్పుడు ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఫాలోవర్స్ పెరిగి సక్సెస్ అయితే అప్పుడు ఈ సీనియర్ నేతలు ఏం చేస్తారో చూడాలి. బీజేపీ అధిష్టానం కూడా లక్ష్మణ్ విషయంలో సానుకూలంగా ఉండటంతో ఆయనకే తిరిగి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరేనేది మాత్రం త్వరలోనే వెల్లడి కానుంది.