Begin typing your search above and press return to search.
టీ బీజేపీకి పరువు సమస్య
By: Tupaki Desk | 7 Aug 2016 6:32 AM GMTతెలంగాణ బీజేపీ నేతలకు ఏకకాలంలో ఆనందం - ఆందోళన కలుగుతోందని చర్చ జరుగుతోంది. 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలమైన ప్రతిపక్షం లేకుండా రాజకీయ శూన్యత ఏర్పడినందున - దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆరాటం ఆరంభమైంది. ముప్పయి ఏళ్ళుగా తోక పార్టీగానే ముద్ర పడినందున, ఇక స్వతహాగా బలపడాలన్న ఆలోచన బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనతో అందుకు శ్రీకారం చుట్టాలని నాయకులు కసరత్తు చేస్తున్నారు.
1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల నుంచి మొదలుకుని 1994 - 1999 - 2004 - 2009లో మహాకూటమిలో కలిసి పని చేసినంత వరకూ ఉమ్మడి ఏపీలో బీజేపీ తోక పార్టీగానే ముద్ర పడింది. ప్రజాకర్షణ కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న తర్వాత కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోతే ఎలా? అనే అభిప్రాయానికి నాయకులు వచ్చారు. పైగా అస్సాంలోనే అధికారాన్ని చేపట్టినప్పుడు - తెలంగాణలో విపక్షాలు బలహీనపడి ఏర్పడిన రాజకీయ శూన్యతను అవకాశంగా చేసుకోలేకపోతే మళ్లీ ఇటువంటి అవకాశం రాదన్న భావనతో వారున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ తో ‘జత’ కడితే తమిళనాడు తరహాలో పార్టీ భూ స్థాపితం అవుతుందన్న భయమూ లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ - కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఇతర ప్రజాప్రతినిధులు ఆ పార్టీలోకి వలస బాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా - ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు. మల్కాజిగిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా వీరిలో 13 మంది మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పంచన చేశారు. లోక్ సభకు ఇద్దరు ఎంపికైతే ఒక్కరే మిగిలారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవలే టీఆర్ ఎస్ ‘కారు’ ఎక్కారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు ప్రారంభంకావడంతో అది తమకే లాభం కలుగుతుందన్న భరోసాకు బీజేపీ రాష్ట్ర నేతలు వచ్చేస్తున్నారు. ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ - టీడీపీలు బలహీనపడడంతో ప్రత్యామ్నాయ శక్తిగా బలపడేందుకు అవకాశాలు పెరుగుతాయని వారు సంతోషిస్తున్నారు.
ఇలా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చందంగా టీడీపీ-కాంగ్రెస్‌ను టీఆర్ ఎస్ అణగదొక్కడంతో, ప్రతిపక్షాల్లో మూడో స్థానంలో ఉన్న తాము మొదటి స్థానానికి వచ్చామని బీజేపీ నేతలు సంతోషిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరుగుతాయన్న భరోసా కల్పిస్తున్నారు. ఒకవేళ సీఈసీ అందుకు అంగీకరించక - ఏదైనా సాంకేతిక - న్యాయ పరమైన చిక్కులతో ఆ ప్రయత్నం బెడిసి కొడితే టీఆర్ ఎస్ లో చేరిన వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంగతేమిటీ? అప్పుడు అక్కడా అసంతృప్తి జ్వాల రగులుతుంది. సీట్లు రావు అనుకున్న నేతలు ప్రత్యామ్నాయ శక్తిగా నిలదొక్కుకున్న బీజేపీలోకి రాక తప్పదని, రాలేని వారు అక్కడే కుంపట్లు పెట్టి తమకు టిక్కెట్ రాకుండా మరొకరికి ఇచ్చిన అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తారని, ఫలితంగా బీజేపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల అంచనా. సీట్లు పెరిగినా నష్టం లేదని - మెజారిటీ సీట్లలో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష స్థాయికైనా ఎదగవచ్చని అంచనా. కాలం కలిసి వస్తే అధికారంలోకి రావచ్చని - లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుని 2024 ఎన్నికల నాటికైనా అధికారం చేపట్టవచ్చని బిజెపి నేతలు లెక్కలు వేస్తున్నారు.
ఇదిలాఉండగా...దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం దృఢ సంకల్పంతో ఉంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన ఎక్కడైనా సీట్లు తగ్గినా - ఆ సంఖ్య దక్షిణాది రాష్ట్రాల నుంచి నింపుకోవాలనేది అధిష్టానం ఆలోచన. ఇందులో భాగంగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం బలంగా విశ్వసిస్తున్నది. అందుకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ లో మండల నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పక్షం రోజులు తిరగకుండానే సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మళ్లీ సెప్టెంబర్ నెలలో రాబోతున్నారు. అంతేకాదు తరచూ తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలూ చేస్తున్నారు. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటితో పాటు పార్టీ నిర్మాణానికీ సమగ్ర ప్రణాళికతో రోడ్ మ్యాప్ రూపొందించే దిశలో రాష్ట్ర పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. తెలంగాణలోని 32 వేల బూత్ లకు వెంటనే పార్టీ కమిటీలు నియమించాలని - ఈ నెలాఖరులోగా జిల్లా - మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకుని ఆగస్టు నుంచి ప్రజా సమస్యలపై విజృంభించి పోరాటం చేయాలని బిజెపి భావన. మొత్తంగా సుదీర్ఘ ప్రక్రియ ద్వారా తోకపార్టీ ముద్ర పోగొట్టుకొని పార్టీ అభివృద్ధి చెందించేందుకు ప్రధానమంత్రి పర్యటనతో బీజం వేసుకోవాలని ఆలోచిస్తోంది.