Begin typing your search above and press return to search.

బీజేపీ బాహుబలి ఎవ‌రో తెలుసా!

By:  Tupaki Desk   |   6 April 2018 5:09 PM GMT
బీజేపీ బాహుబలి ఎవ‌రో తెలుసా!
X
ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఈ సంద‌ర్బఃగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తమ పార్టీని వీడిపోతున్న నాగం జ‌నార్ద‌న్ రెడ్డి మొద‌లుకొని ...త‌మ‌కు కొత్త బాధ్యుడిగా ఉన్న రానున్న రామ్‌మాధ‌వ్ గురించి కూడా ఆయ‌న ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన నాగంకు మేము ఏమి తక్కువ చేయలేదని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ఎన్నికల్లో పార్లమెంటు టిక్కెట్ ఇచ్చామని, జాతీయ కార్యవర్గ సభ్యుడుగా గౌరవించామని, మా కార్యకర్తల పదవులు త్యాగం చేసి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇచ్చామన్నారు. నాగం కొడుక్కి నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇచ్చామని అయితే ఆయ‌న చిత్తుగా ఓడిపోయార‌న్నారు. నాగం జనార్ధన్‌ రెడ్డి త‌న కొడుకుని అసమర్థుడ్ని పెట్టుకొని తమ పార్టీ పై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. అదే నియోజ‌క‌వ‌ర్గంలో మర్రి జనార్దన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చిఉంటే మహబూబ్‌ నగర్ పార్లమెంట్ తోపాటు నాగర్ కర్నూల్‌ లో కూడా గెలిచేవాళ్ళమని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. పదవుల కోసం కొత్త వాళ్ళు వస్తే... త‌మ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

రాంమాదవ్ ప్రభావం దక్షిణాది అంతటా ఉంటుందని, ఆయ‌న స‌త్తా రాబోయే కాలంలో తెలుస్తుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ అన్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌ జీవీఎల్ నర్సింహ రావ్ ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతున్నార‌ని, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. జూన్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి సిద్దం చేస్తున్నామన్నారు. జాతీయ పార్టీ అనుమతి వచ్చిన తరువాత ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెండు రోజుల్లో ఏపీ అధ్యక్షడు ఎవరో తెలుస్తుందని, మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరు తెర పైకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఓటమి చెందిన పార్టీలు కూటమిగా కావడం వల్ల ఒరిగేది ఏమీలేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ జనసమితి పార్టీకి కోదండరాం కు ప్రజల్లో గుర్తింపు ఉందని - జనసమితి కాంగ్రెస్ తో పోతే కోదండరాం పుట్టి మునిగినట్లే అని ల‌క్ష్మ‌ణ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ.. కర్ణాటకలో ఎన్నికల్లో తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలవడం తథ్యం అన్న ఆయన తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ ఎస్‌ పై పోరాటం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మొత్తం పార్టీని బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం సస్పెండ్ చేస్తే..కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదన్నారు.