Begin typing your search above and press return to search.

కేసీఆర్ దేవుడే ఓడిపోయాడు..టీఆర్ ఎస్ అధినేత ఎంత‌?

By:  Tupaki Desk   |   3 May 2018 11:11 AM GMT
కేసీఆర్ దేవుడే ఓడిపోయాడు..టీఆర్ ఎస్ అధినేత ఎంత‌?
X
మిగిలిన రంగాల్లో మాదిరి రాజ‌కీయాల్లోనూ అనుభ‌వానికి ఉండే ప్ర‌త్యేక‌త వేరు. నాలుగైదు త‌రాల్ని చూసిన నేత‌ల అనుభ‌వ‌పు మాట‌లు చాలా సంద‌ర్భాల్లో స‌ముచితంగా అనిపిస్తాయి. ఇప్ప‌టి నేత‌ల మాదిరి దూకుడుతో నోరు పారేసుకోవటం కాకుండా.. తాము వినిపించే వాద‌న‌కు లాజిక్ వినిపిస్తారు. అవున‌ని అనేలా ఉదాహ‌ర‌ణ‌లు కూడా చూపిస్తారు. తాజాగా అలాంటి ప‌నే చేశారు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె. ల‌క్ష్మ‌ణ్‌.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ రాగాన్ని వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా త‌మ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఉంటుంద‌ని చెప్పిన సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చారు. ఎందుక‌న్న ప్ర‌శ్న‌ను సంధించే లోపే ఆయ‌నే చెప్పుకొచ్చారు.

తెలుగోళ్లు ఎప్పుడూ మ‌ర్చిపోలేని ఎన్టీఆర్ అంటే.. కేసీఆర్ కు సైతం ఇష్టం. ఎంతంటే.. త‌న కొడుక్కి పేరు పెట్టుకునేంత‌. అయితే.. ఇప్పుడున్న వేళ ఆయ‌న ఆ మాట‌ల్ని బ‌య‌ట‌కు చెప్ప‌రు కానీ.. కేసీఆర్ స‌మకాలీనులు మాత్రం ఎన్టీఆర్ అంటే కేసీఆర్‌ కుండే ప్రేమాభిమానాల గురించి గొప్ప‌గా చెబుతుంటారు. త‌న ఆరాధ్య దైవంగా కొలిచే వార‌న్న మాట‌ను చెప్పే వారు లేక‌పోలేదు.

కేసీఆర్ కు అంత గురి ఉన్న ఎన్టీఆర్ ఉదాహ‌ర‌ణ చెబితే బాగా అర్థ‌మ‌వుతుంద‌ని అనుకున్నారో ఏమో కానీ.. ల‌క్ష్మ‌ణ్ ఆయ‌న గురించి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు చేసిన ఎన్టీఆర్‌ కు ఆ త‌ర్వాత రాష్ట్రంలో ఓడిపోయిన వైనాన్ని గుర్తు చేశారు. నాడు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఎన్టీఆర్.. కొంత‌మేర విజ‌యం సాధించినా.. సొంత రాష్ట్రంలో మాత్రం ఓడిపోయార‌న్నారు. ఇప్పుడు కేసీఆర్‌ కూ అదే గ‌తి ప‌డుతుంద‌న్నారు.

కాంగ్రెస్ ను తోక పార్టీ అంటున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు అదే తోక పార్టీతో సంబంధాలు ఉన్న అధినేత‌ల్ని ఎందుకు క‌లుస్తున్న‌ట్లు? అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ కాంగ్రెస్‌ కు మేలు క‌లిగించేలా ఉన్నాయ‌ని.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రి.. ల‌క్ష్మ‌ణ్ చెప్పిన‌ట్లు ఎన్టీఆర్ ఎగ్జాంఫుల్ కేసీఆర్ విష‌యంలో రిపీట్ అవుతుందా?