Begin typing your search above and press return to search.

స‌భ నిర్వ‌హించ‌డ‌మంటే..ట్వీట్ చేసినంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   3 Sep 2018 2:39 PM GMT
స‌భ నిర్వ‌హించ‌డ‌మంటే..ట్వీట్ చేసినంత ఈజీ కాదు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పూర్త‌యి ఒక‌రోజు దాటిపోయిన‌ప్ప‌టికీ... ఈ స‌భ‌పై ఇంకా విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. అధికారప‌క్షం తీరును ప్ర‌తిప‌క్షం ఎండ‌గ‌డుతుంటే... మ‌రోవైపు త‌మ వైఖ‌రిని పాల‌క‌ప‌క్షం స‌మ‌ర్థించుకుంటోంది. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్ సైతం రియాక్ట‌య్యారు. నిన్నటి సభ అట్టర్ ప్లాప్‌ గా జరిగిందని తెలిపారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రేయేట్ చేశారని అయితే - హౌస్ సోల్ కలెక్షన్ నిల్‌ గా నిలిచిందని ఎద్దేవా చేశారు.

ప్ర‌గతి నివేద‌న‌ సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని కానీ కేసీఆర్ ఆవేదన సభగా ఆ స‌భ మిగిలింద‌ని బీజేపీ అధ్య‌క్షుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల శంఖారావంలాగా - తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చు పెట్టారని విరుచుకుప‌డ్డారు. ట్విట్టర్ లో స్పందించినంత ఈజీ కాదు సభలు నిర్వహించడం అంటూ ప‌రోక్షంగా కేటీఆర్‌ పై సెటైర్లు వేశారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కోసం ధనబలం అధికార - ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలను తరలించే విషయంలో వందల కోట్లు ఖర్చుపెట్టారు తప్ప ప్రజలను సమీకరించలేదన్నారు. సీఎం మాటలలో బలం లోపించిందని - ఒక దశ దిశ లేదని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మాట్లాడేటప్పడు మంత్రుల ముఖంలో నెత్తురు చుక్కలేదని అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేరకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని మండిప‌డ్డారు. ముందస్తు కు వెళ్తే ముందస్తు ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చుకున్నారు తప్ప ఒరిగిందేమి లేద‌న్నారు. తాము ఫ్లెక్సీలు కడితే రాత్రి కి రాత్రే జీహెచ్ ఎంసీ అధికారులు తొలగించారని కానీ ప్ర‌స్తుతం అలాగే కొన‌సాగించ‌డం ద్వారా అధికార పార్టీకి తొత్తులుగా మారారనేది స్ప‌ష్ట‌మ‌యింద‌న్నారు.

ఎన్నికలను ఆషామాషీగా తీసుకోబోమ‌ని, ముంద‌స్తు వ‌చ్చినా...షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగినా తాము సిద్ధ‌మ‌ని బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స్ప‌ష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా కూడా ముందస్తుకు సిద్ధ‌మని చెప్పార‌ని ఆయ‌న వెల్లడించారు. ఆయ‌న‌తో జ‌రిగిన‌ మూడు గంటల చర్చలలో వెనక్కి తగ్గకూడదని చెప్పారని, అంతేకాకుండా ప్రచారం కూడా స్వయంగా తానే చేస్తానని హామీ ఇచ్చార‌ని తెలిపారు. ఈనెల 8 - 9 తేదీల్లో జ‌రిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి పెడతామని హామీ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇత‌ర‌ రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ‌లో కూడా ప్ర‌త్యేక ఫార్ములాతో ముందుకు సాగుతామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.