Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారు వారి వార్షిక బడ్జెట్ హైలెట్స్
By: Tupaki Desk | 8 March 2020 8:19 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ సర్కారు మరో వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమర్పించిన ఈ బడ్జెట్ లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయని చెప్పాలి. మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ లో అంకెలు ఘనంగా కనిపించే కసరత్తు జరిగింది. లోటు పోటు కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్ ఏకంగా రూ.1.82 కోట్లను దాటేయటం గమనార్హం.
బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు. బడ్జెట్ అంటే.. సామాజిక విలువల స్వరూపమంటూ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన హరీశ్.. భారత ఆర్థికవృద్ధి రేటు ఏడాది నుంచి తగ్గుతూ వస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ.. జీఎస్టీ పరిహారం సకాలంలో రావటం లేదన్న ఆయన.. మాంద్యం ప్రభావం రాష్ట్ర పన్నులు.. పన్నేతర ఆదాయం మీద పడినట్లు చెప్పారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా.. బడ్జెట్ లో వేసుకున్న అంచనాల కంటే రూ.3,731 కోట్లు తగ్గినట్లుగా పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ.. జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో రావటం లేదన్న ఆరోపణను సంధించారు.
ఇలాంటి కారణాలతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018-19లో 16.1 శాతం ఉంటే.. అది కాస్తా గత ఏడాది ఫిబ్రవరి నాటికి 6.3 శాతానికి తగ్గినట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ గణాంకాల్ని చూస్తే.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించక మానవు.
లెక్కల్లోకి వెళితే..
- 2020-21 బడ్జెట్ : 1,82,914.42 కోట్లు
- రెవెన్యూ వ్యయం : 1, 38, 669.82 కోట్లు
- క్యాపిటల్ వ్యయం : 22,061.18 కోట్లు
- రెవెన్యూ మిగులు : 4,482.12 కోట్లు
- ఆర్థిక లోటు : 33,191.25 కోట్లు
కేటాయింపులు
మైనారిటీ సంక్షేమానికి రూ. 1518.06కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 16534.97 కోట్లు
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 9771.27 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు
చిన్న నీటిపారుదలశాఖకు రూ.600 కోట్లు
రైతు వేదిక నిర్మాణానికి రూ.300 కోట్లు
సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు
ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు
అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు
మత్స్యకారుల సంక్షేమానికి రూ.1586 కోట్లు
కల్యాణలక్ష్మి - షాదీముబారక్ కోసం రూ. 350 కోట్లు
మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు
ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.480 కోట్లు
మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1200 కోట్లు
పంచాయతీరాజ్ అభివృద్ధికి రూ. 23,500 కోట్లు
మున్సిపల్ శాఖకు రూ. 14,809 కోట్లు
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.2,650 కోట్లు
పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1,723 కోట్లు
వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు
ఆర్టీసీకి రూ.1000 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.15,18 కోట్లు
పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు
హరితహారం కోసం రూ. 791 కోట్లు
ఆర్ అండ్‌బీ కోసం రూ. 3,494 కోట్లు
పోలీస్ శాఖకు రూ.5,852 కోట్లు
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కు రూ.1000 కోట్లు
పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు
విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు
అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు
దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం రూ.600 కోట్లు
దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం రూ.50 కోట్లు
సంక్షేమ పథకాలు
ఎస్సీ - ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం రూ.20 లక్షల ఆర్థికసాయం
ఎస్సీ - ఎస్టీ గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
ఎస్సీ - ఎస్టీ కార్పొరేషన్ రుణాలు - మైక్రో ఇరిగేషన్ కోసం సబ్సిడీ రెట్టింపు
మార్కెట్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ - ఎస్టీలకు రిజర్వేషన్లు
ఎస్సీ - ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు
పంచాయతీల్లో 36 వేల పారిశుద్ధ్య కర్మచారుల వేతనం రూ.8,500 కి పెంపు
మొత్తం రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ లో కేవలం కొన్ని అంశాలకే రూ.1.3లక్షల కోట్లు కేటాయింపులు జరగటం గమనార్హం. అందులో ఎస్సీ ప్రత్యేక నిధికి రూ.16,534 కోట్లు.. ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి రూ.9771.27 కోట్లు.. రైతు బంధుకు రూ.14వేలు.. సాగునీటి రంగానికి రూ.11వేల కోట్లు.. అన్ని రకాల పెన్షన్లకు రూ.11,758 కోట్లు.. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం రూ.10వేల కోట్లు.. పంచాయితీరాజ్ డెవలప్ మెంట్ కు రూ.23,500 కోట్లు.. మున్సిపల్ శాఖకు రూ.14,809 కోట్లు.. పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు.. వైద్య రంగానికి రూ.6,186 కోట్లు.. విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్లుగా చెప్పాలి.