Begin typing your search above and press return to search.
ఎన్ని గంటలు సా...గుతుందో..?
By: Tupaki Desk | 2 Jan 2016 9:49 AM GMTపేర్లకు తగ్గట్లే ఇద్దరు చంద్రుళ్లకు సంబంధించి చాలానే పోలికలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అలవాట్ల విషయంలోనూ చాలా దగ్గరితనం కనిపిస్తుంది. వ్యక్తిత్వాలు.. వ్యూహాలు.. అలవాట్ల విషయంలో తూర్పు పడమరలుగా ఉండే ఇద్దరుచంద్రుళ్లు పాలనా పరమైన అంశాలకు సంబంధించి మాత్రం ఒకే తీరును ప్రదర్శిస్తుంటారు. అధికారులతో సమీక్షా సమావేశాల్నే పరిశీలిస్తే.. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక.. ఏదైనా ప్రత్యేక రివ్యూ పెట్టుకున్నా కాల పరిమితి అన్నది లేకుండా సాగిపోతూ ఉంటుంది.
కాకపోతే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సమావేశాలు బోరింగ్ గా ఉంటాయన్న పేరుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే సమావేశాలు ఉల్లాసంగా ఆసక్తికరంగా సాగుతుంటాయని చెబుతుంటారు. ఇక.. మంత్రివర్గ సమావేశాలు సైతం ఇదే పరిస్థితి. ఇద్దరు నిర్వహించే మంత్రివర్గ సమావేశాలు గంటల కొద్దీ సాగుతుంటాయి.
కొద్దిరోజులుగా అధికారిక కార్యకలాపాల గురించి పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ రోజు భారీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో పలు అంశాల్ని చర్చించేందుకు పే...ద్ద ఎజెండాను సిద్ధం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహిస్తున్న క్యాబినెట్ మీటింగ్ తో పాటు.. గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పెట్టుకున్న మంత్రివర్గ సమావేశం కావటం గమనార్హం.
మరి.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సమావేశానికి కాల పరిమితి ఉందా? అంటే లేదనే చెబుతున్నారు. మామూలుగానే.. గంటలకొద్దీ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించే కేసీఆర్.. తాజాగా పెద్ద ఎత్తున ఎజెండా ఉన్న నేపథ్యంలో.. క్యాబినెట్ భేటీ సుదీర్ఘంగా సా...గిపోవటం ఖాయమంటున్నారు.