Begin typing your search above and press return to search.
తెలంగాణ కేబినెట్ భేటీ ... సీఎం నిర్ణయం పై ఉత్కంఠత !
By: Tupaki Desk | 5 May 2020 6:45 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు (మంగళవారం) కేబినెట్ జరిగే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రం మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో రాష్ట్రంలోనూ లాక్‌డౌన్ పొడిగించనున్నారు. అదే సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులను రాష్ట్రంలోనూ అమలు చేస్తారా?లేదా ? అనేది భేటీ తరువాత తెలుస్తుంది.
ముఖ్యంగా రాష్ట్రంలో వైన్స్ షాపులు తెరవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం తో కేంద్రం సూచించిన విధంగా గ్రీన్ జోన్ల పరిధిలో మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశంపై కూడా సుదీర్ఘంగా సిఎం కేసీఆర్ చర్చించనునట్లుగా తెలుస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నమోదు అవుతున్న నేపథ్యంలో.. జీహెచ్ ఎం సీ పరిధిలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం, కేంద్ర మార్గదర్శకాల అమలు లాంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఎత్తేశాక టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సర్కారు ఇదివరకే ప్రకటించింది. ఈ అంశాలపై మరికాసేపట్లో ప్రారంభం అయ్యే క్యాబినెట్ సమావేశంలో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి కేబినెట్ భేటిపై సర్వత్వ ఉత్కంఠ నెలకొంది.