Begin typing your search above and press return to search.
కేసీఆర్ తెలివే తెలివి.. బాబు చేసిన పనిని చేస్తూ ఎంత జాగ్రత్త
By: Tupaki Desk | 20 Jun 2021 3:08 PM GMTవినూత్నంగా వ్యవహరించటం రాజకీయాల్లో ఎప్పుడూ కలిసి వస్తుంది. అయితే.. ముందు వెనుకా చూసుకోవటం చాలా ముఖ్యం. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించటమే కాదు.. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు.. సీఈవోను అంటూ సగర్వంగా చంద్రబాబు ప్రకటించుకున్న పాత రోజుల్లోకి వెళితే.. ఆయన తరచూ ఆకస్మిక తనిఖీలు చేసేవారు. ఆ సందర్భంగా చోటు చేసుకునే డ్రామా.. తెలుగు ప్రజలకు సరికొత్తగా అనిపించేది. మొదట్లో ఈ వైఖరిపై ప్రజల్లో హర్షం వ్యక్తమైనప్పటికి.. రాన్రాను అదో అలవాటుగా మారింది. అదేసమయంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రవ్యతిరేకతకు కారణమైంది.
పని చేయమని.. బాధ్యతగా ఉండమని అడిగితే ఎవరికైనా ఇబ్బంది. అదే సమయంలో చర్యల కత్తి తీసుకొని ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటే ఇంకేమైనా ఉందా? అందుకే.. ఆకస్మిక తనిఖీలపై అధికారులు.. సిబ్బంది గుర్రుగా ఉండేవారు. ఇదో విఫల ఆలోచనగా భావించిన చంద్రబాబు.. ఆ మధ్యన ముఖ్యమంత్రి అయినప్పుడు అలాంటి సర్ ప్రైజ్ విజిట్లతో షాకులు ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్ని చూస్తే.. గడిచిన కొన్నేళ్లుగా ఆకస్మిక తనిఖీల పేరుతో హడావుడి చేసే పాలకులు కనిపించరు.
ఆ కొరత తీరుస్తూ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో అలాంటి పని చేయనున్నట్లు ప్రకటించారు. ఎంతైనా ఒకప్పటి చంద్రబాబు శిష్యుడు కావటం.. తన మాజీ గురువుకు ఎదురైన చేదు అనుభవాలు గుర్తుకు వచ్చాయట్లుంది తాజాగా ఆయన మాటలు చూస్తుంటే. త్వరలో తాను జరిపే ఆకస్మిక తనిఖీలపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆకస్మిక తనిఖీల పేరుతో ఎవర్నో తొలగించటం తన ఉద్దేశం కాదని.. పని చేయని వారిని ఏం చేయాలని ప్రశ్నించే తీరు చూస్తే.. కేసీఆర్ తెలివికి ముచ్చట పడాల్సిందే. త్వరలో తాను తీసుకునే నిర్ణయాలతో వ్యతిరేకతకు ముందే చెక్ చెబుతూ.. తాను వేటు వేస్తే.. వారంతా పని చేయని వారన్నట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న వైనం ముచ్చటగా ఉందని చెప్పకతప్పదు.