Begin typing your search above and press return to search.
కొడుక్కి పేరే పెట్టుకున్న పెద్ద మనిషి.. సొంత మీడియాలో చోటివ్వరా?
By: Tupaki Desk | 28 May 2022 9:23 AM GMTనందమూరి తారక రామారావు. ఈ పేరుకున్న ఇమేజ్ తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజల జీవనగమనాన్ని మార్చటమే కాదు.. వారిని..వారి జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ప్రముఖుడు. అలాంటి ఆయన తొంభైతొమ్మిదో జయంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన సొంత మీడియా అనుసరించి వైనం ఇంకో ఎత్తుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ మీద గులాబీ బాస్ కేసీఆర్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఉన్న ఇష్టంతో.. తన కుమారుడి పేరును యథాతధంగా పెట్టుకోవటం చూసినప్పుడు ఎన్టీఆర్ మీద ఆయనకున్న ప్రేమాభిమానాలను ఎవరూ శంకించరు. తన జీవితంలో ఎన్నడూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పల్లెత్తు మాట అనటం కేసీఆర్ లో కనిపించదు. అలాంటి ఆయన.. తమ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక్క ఫోటో.. ఒక్క వార్త కూడా ఇవ్వకపోటం.. ఒక ప్రత్యేక కథనాన్ని రాయకపోవటం దేనికి నిదర్శనం?
రాజకీయంగా లెక్కలు తేడా ఉన్నాయే అనుకుంటే.. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవల్ని అయినా ప్రస్తావించొచ్చు. నటుడిగా సర్వామోదం పొందిన ఆయనకు సంబంధించిన కథనం కేసీఆర్ కుటుంబ పత్రికలో చోటివ్వకపోవటం చూస్తే.
తెలుగువారి మనోభావాల మీద ఆయనకున్న గౌరవం ఏంతన్న కొత్త సందేహం కలుగక మానదు. కన్న కొడుక్కి పేరు పెట్టుకున్న పెద్ద మనిషి.. తీరా ఆ పెద్ద మనిషి నూరో జయంతి సందర్భంగా తన పత్రికలో ఒక కథనం ప్రచురిస్తే పోయేదేంది?
ఎన్టీఆర్ మీద ఎలాంటి ప్రత్యేక కథనం లేకపోలేదు సరికదా..ఎన్టీఆర్ వందోజయంతి ఆరంభానికి సంబంధించిన చిన్న మేటర్ సైతం లేకపోవటం దేనికి నిదర్శనం? ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రముఖంగా వార్త వేయకపోవచ్చు.
ప్రత్యేక కథనాలు పేజీల చొప్పున ఇవ్వకపోవచ్చు. చిన్న చిన్న విషయాలకే నింగిని.. నేలను ఏకం చేస్తూ హాడావుడి చేసినంత కాకున్నా.. ఒక్కటంటే ఒక్క కథనం కూడా ఇవ్వకపోవటం చూస్తే.. ఇదేంది సారు అనుకోకుండా ఉండలేని పరిస్థితి.