Begin typing your search above and press return to search.
ఇప్పుడీ మాటలేంది కేసీఆర్? మనం ప్రభుత్వం పవర్లోకి వచ్చి 8 ఏళ్లు అవుతోంది?
By: Tupaki Desk | 18 July 2022 4:47 AM GMTవిజయం సాధించినప్పుడు క్రెడిట్ మొత్తం నాది.. ఫెయిల్ అయినప్పుడు అందుకు కారణం టీం మొత్తానిది అని చెప్పేటోడు జట్టు నాయకుడు అసలే కాడు. సక్సెస్ ను అందరికి పంచి.. ఫెయిల్యూర్ ను మాత్రం తానే తీసుకునేటోడే మొనగాడు. అలాంటిది అంతా బాగా జరుగుతున్న వేళలో.. ఇదంతా తన గొప్పతనంగా గొప్పగా ఫీలయ్యే పాలకులు.. విపత్తు విరుచుకుపడిన వేళలో చోటు చేసుకునే విషాదంలో మాత్రం.. దానికి కారణమంతా గత పాలకులు అనే మాట నోటి నుంచి రావటంలో అర్థం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఎనిమిదేళ్లకు పైనే అవుతోంది. ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయిల చొప్పున (సరాసరిన) వేసుకున్నా.. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.12 లక్షల కోట్ల రూపాయిలు. ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు అందుకు తగ్గ ఫలాలు ప్రజలకు అందాల్సిన అవసరం ఉంది.
అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసే సత్తా ఉన్నట్లుగా తన గురించి తాను గొప్పగా చెప్పుకునే కేసీఆర్.. ఇప్పటికే విద్యుత్ సమస్యను తీర్చేసినట్లుగా పదే పదే చెప్పటాన్ని మర్చిపోకూడదు. అంతేనా.. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్ని 99 శాతానికి పైనే తీర్చేసి.. తాను కలలు కన్న బంగారు తెలంగాణను ఇప్పటికే తెచ్చేసినట్లుగా ఫీలయ్యే వేళలో.. ఇప్పుడొచ్చిన ముంపు సమస్యను గత ప్రభుత్వాల మీదకు నెట్టటంలో అర్థం లేదు.
అన్ని సిద్ధం చేసి.. మీరొచ్చి ఏలుకోండని ఎవరూ అధికారాన్ని చేతికి ఇచ్చి వెళ్లరు కదా? గత ప్రభుత్వాలు సరిగా పాలించని కారణంగానే.. గులాబీ అధినేత చేతికి అధికారం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ విషయాన్ని వదిలేసి.. ఎప్పటిలానే రొడ్డు కొట్టుడు తరహాలో రాష్ట్రంలో వచ్చే వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పటం బాగానే ఉన్నా.. గత ప్రభుత్వాలు చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు అంటూ విమర్శలు చేయటంలో అర్థం లేదు.
అధికారంలోకి వచ్చిన నిన్ననో.. మొన్ననో అయితే.. ఇలాంటి మాటలు అన్నా సర్దుకోవచ్చు. కానీ.. పవర్లోకి వచ్చి ఎనిమిదేళ్లకు పైనే అయిపోయి.. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో ఆరేడు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా మాటలు వినిపిస్తున్నప్పుడు.. గత ప్రభుత్వాలు అంటూ కేసీఆర్ నోటి నుంచి మాటలు రావటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముంపునకు శాశ్వితంగా చెక్ పెట్టేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరద పరిస్థితులపై భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా ప్రత్యేక బుక్ లెట్ తయారు చేయాలని ఆయన నీటిపారుదల శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వరదల కారణంగా ముంపునకు గురైన నాలుగు జిల్లాలకు రూ.8.3 కోట్ల కేటాయించటం షాకింగ్ గా మారింది. సాయం అన్నంతనే వెనుకా ముందు చూసుకోకుండా వరాలు ఇచ్చే అధినేతగా సుపరిచితమైన సీఎం కేసీఆర్.. అందుకుభిన్నంగా తక్షణ సాయం కింద రూ.8.3 కోట్లు ఇవ్వటం గమనార్హం. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగిందన్నంతనే నష్ట పరిహారం కింద కోట్లాది రూపాయిలు ప్రకటించే కేసీఆర్.. నాలుగు జిల్లాలకు జరిగిన నష్టానికి తక్షణ సాయం కింద కేవలం రూ.8.3 కోట్లు ప్రకటించటం ఆసక్తికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. నిధుల కొరత లేదన్న సీఎం.. ఇంత ఆచితూచి అన్నట్లుగా తక్షణ సాయాన్ని ప్రకటించటం.. అది కూడా తన స్టైల్ కు విరుద్ధంగా రౌండ్ ఫిగర్ ను ప్రకటించకపోవటం దేనికి నిదర్శనం అంటారు కేసీఆర్? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.